ACB Court: వాసుదేవరెడ్డి,సత్యప్రసాద్‌లకు ముందస్తు బెయిల్ నిరాకరణ
ABN, Publish Date - Jul 19 , 2025 | 04:01 AM
మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తర్వాతి స్థానాల్లో ఉన్న కీలక నిందితులకు ఉపశమనం దక్కలేదు.
పిటిషన్లను తిరస్కరించిన ఏసీబీ కోర్టు
విజయవాడ, జూలై 18 (ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తర్వాతి స్థానాల్లో ఉన్న కీలక నిందితులకు ఉపశమనం దక్కలేదు. వైసీపీ హయాంలో రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ ఎండీగా వ్యవహరించిన డి.వాసుదేవరెడ్డి(ఏ-2), ప్రత్యేకాధికారిగా ఉన్న సత్యప్రసాద్ (ఏ-3)లకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు విజయవాడ ఏసీబీ న్యాయస్థానం నిరాకరించింది. కసిరెడ్డిని సిట్ అరెస్టు చేసినప్పటి నుంచి నిందితుల అరెస్టులు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో తమకూ సంకెళ్లు పడతాయని భావించిన వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ ముందస్తు బెయిల్ కోసం శుక్రవారం కోర్టును ఆశ్రయించారు. అయితే వాటిని న్యాయాధికారి పి.భాస్కరరావు తిరస్కరించారు.
Updated Date - Jul 19 , 2025 | 04:07 AM