కూటమి ప్రభుత్వ విజయాలకు ఏడాది
ABN, Publish Date - Jun 04 , 2025 | 11:25 PM
సరిగ్గా ఏడాది కింద జగన అరాచక పాలన అంతమైంది ఈ రోజే అని రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు.
ఐదేళ్ల జగన అరాచక పాలన అంతమైన రోజు - మంత్రి బీసీ
బనగానపల్లె, జూన 3 (ఆంఽఽధ్రజ్యోతి): సరిగ్గా ఏడాది కింద జగన అరాచక పాలన అంతమైంది ఈ రోజే అని రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు. బుధవారం మంత్రి బీసీ జనార్దనరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఘన విజయానికి ఏడాది అయిందని మంత్రి బీసీ తెలిపారు. అధికారం పేరుతో ఊరేగిన వైసీపీ ఉన్మాదాన్ని ప్రజలు ఎన్నికల్లో తరిమికొట్టింది ఇదే రోజని అన్నారు. పసుపు సైనికుల పోరాటాలు, జనసైనికుల ఉద్యమాలు, కమలనాధుల మద్దతుతో రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్డారన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుకు ఏడాది పూర్తయిన సందర్భంగా నాటి విజయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రజలకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియచేస్తున్నా అన్నారు. వచ్చే నాలుగేళ్లలో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి రాషా్ట్రన్ని, బనగానపల్లె నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. బనగానపల్లె నియోజకవర్గంలోని ప్రజల అభివృద్ధికి టీడీపీ కార్యకర్తలు, నాయకులు నిరంతరం పనిచేస్తారని అన్నారు.
Updated Date - Jun 04 , 2025 | 11:25 PM