TANA Repalle: దిగ్విజయంగా 'తానా' మూడు రోజుల అన్నదానం
ABN, Publish Date - Aug 02 , 2025 | 05:44 PM
ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న కమ్యూనిటీ సేవా కార్యక్రమాల్లో భాగంగా రేపల్లెలో మూడు రోజుల పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర..
రేపల్లె, ఆగష్టు 2 : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న కమ్యూనిటీ సేవా కార్యక్రమాల్లో భాగంగా రేపల్లెలో మూడు రోజుల పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ఉన్న పేదలకోసం తానా ఫౌండేషన్ 'అన్నపూర్ణ' కార్యక్రమాన్ని గతంలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా అభాగ్యులకు అవసరం వున్న చోట భోజనాన్ని అందిస్తున్నారు.
తానా ఫౌండేషన్ మాజీ అధ్యక్షులు శశికాంత్ వల్లేపల్లి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు రేపల్లెలో నిర్వహించారు. ఈ సందర్భంగా తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి మాట్లాడుతూ, తానా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకోసం ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తోంది.. అన్నీ దానాల్లో కన్నా అన్నదానం మిన్న అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నపూర్ణ పేరుతో పేదలకు అన్నదానం చేస్తున్నామని చెప్పారు.
'మూడు రోజుల పాటు, అన్నార్తులందరికి శ్రద్ధ, ప్రేమతో తానా వాలంటీర్‌లు భోజనాలు వడ్డించారు. పండుగ విందు కంటే ఏమాత్రం తక్కువ కాని భోజనాన్ని పెట్టారు. మెనూ సమృద్ధిగా, వైవిధ్యంగా ఉంది' అని ఆయన తెలిపారు. 'ఇందులో ప్రతిరోజూ వివిధ రకాలతో కూడిన కూరలు, పిండి వంటలు ఉన్నాయి. ఈ కార్యక్రమం ఎదో పేరు కోసం అన్నదానం చేసినట్టు తూతూ మంత్రం లాగ కాకుండా, కృతజ్ఞత, సమాజ స్ఫూర్తితో నిండిన పండుగలా అన్న వితరణ కార్యక్రమం నిర్వహించాం. ఈ సేవా కార్యం మరోసారి సమాజానికి తిరిగి ఇవ్వడం, ఒకరినొకరు ఆప్యాయంగా చూసుకునే తెలుగు సంప్రదాయాన్ని కాపాడుకోవడం కోసం తానా నిబద్ధత ప్రదర్శిస్తుంది' అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి..
ఓటర్ల జాబితాలో నా పేరు లేదన్న తేజస్వి.. ఈసీ కౌంటర్
పాతాళ లోకంలో దాగినా వదలబోం.. మళ్లీ దాడి చేస్తే మాత్రం..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 02 , 2025 | 05:44 PM