ఎన్నికల హమీలకు వెన్నుపోటు
ABN, Publish Date - Jun 04 , 2025 | 11:30 PM
కూటమి ప్రభుత్వం ఎన్నికల హమీలకు వెన్నుపోటు పొడించిందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహనరెడ్డి అన్నారు.
వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహనరెడ్డి
కర్నూలులో వైసీపీ శ్రేణుల నిరసన
కర్నూలు న్యూసిటీ, జూన 4(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఎన్నికల హమీలకు వెన్నుపోటు పొడించిందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహనరెడ్డి అన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా వైసీపీ నాయకులు జిల్లా వ్యాప్తంగా ‘వెన్నుపోటు దినం’ నిర్వహించారు. కర్నూలు నగరంలో ఆ పార్టీ నాయకులు గౌరీ గోపాల్ ఆసుపత్రి నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వేలాదిమంది వైసీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద జరిగిన నిరసనలో నాయకులు కూటమి ప్రభుత్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్బంగా ఎస్వీ మోహనరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హమీలు సూపర్ సిక్స్ మెనిఫెస్టోను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రతి వర్గం ఈ ప్రభుత్వ పాలన వల్ల తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ప్రజల హక్కులు, గౌరవ, భవిష్యుత్తును కాపాడేందుకు వైసీపీ తరపున కార్యకర్తలు, అభిమానులతో పాటు అందరు కలిసి వస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన, కేడీసీసీ మాజీ చైర్‌పర్సన ఎస్వీ విజయమనోహరి, గ్రంథాలయ మాజీ చైర్మన సుభాష్‌చంద్రబోసు, నాయకులు అహ్మద్ అలీఖాన, తిరుమలేశ్వరరెడ్డి, మద్దయ్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 04 , 2025 | 11:30 PM