ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణం

ABN, Publish Date - May 11 , 2025 | 11:19 PM

మండలం లోని యాపదిన్నెలో లక్ష్మీ నరసింహస్వామి తిరునాళ్ల ఘనంగా జరుగుతున్నాయి.

లక్ష్మీనరసింహస్వామి కల్యాణంలో పాల్గొన్న గ్రామ పెద్దలు, మహిళలు

డోన రూరల్‌, మే 11 (ఆంధ్రజ్యోతి): మండలం లోని యాపదిన్నెలో లక్ష్మీ నరసింహస్వామి తిరునాళ్ల ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివా రం ఉదయం స్వామివారి క ల్యాణం అర్చకుల వేద మం త్రోచ్ఛరణల మధ్య గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కన్నుల పండువగా సాగింది. స్వామి వారి కల్యాణాన్ని తిలకించిన భక్తులు మంత్రముగ్ధుల య్యారు. అంతకుముందు ఆ లయంలో స్వామివారికి తె ల్లవారుజాము నుంచే ప్రత్యే కపూజలు, అభిషేకాలు అర్చ కులు నిర్వహించారు.

వైభవంగా రథోత్సవం

లక్ష్మీనరసింహస్వామి తిరునాళ్లను పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం స్వామివారి రథోత్సవం రమణీయంగా సాగింది. గ్రామ ఆలయం వద్ద నుంచి రథాన్ని లాగుతూ నమో నారసింహ నమో నమః అంటూ ముందుకు సాగారు. రథోత్సవ కార్యక్రమం అశేష భక్తజనవాహిని మధ్య కన్నుల పండువగా సాగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - May 11 , 2025 | 11:19 PM