IPS Transfer: ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ
ABN, Publish Date - Jan 20 , 2025 | 08:55 PM
IPS Transfer: రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 27 మంది అధికారులను బదిలీ చేశారు.
అమరావతి, జనవరి 20: రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బదిలీ చేసింది. మొత్తం 27 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ చైర్మన్‌గా ఆర్కే మీనాను నియమించారు. శాంతి భద్రతల అదనపు డీజీగా ఎన్. మధుసూధన్ రెడ్డిని బదిలీ చేశారు. ఆపరేషన్స్ ఐజీపీగా సీహెచ్ శ్రీకాంత్‌ను నియమించారు. ఆయనకు టెక్నికల్ సర్వీసెస్ ఐజీపీగా కూడా ఆయన అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారని జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్‌గా పాలరాజు, ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్‌గా రాజ్ కుమారిని నియమించారు.
ఇక తిరుపతి ఎస్పీగా హర్షవర్థన్‌రాజు బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే కర్నూలు జిల్లా ఎస్పీగా విక్రాంత్ పాటిల్, కాకినాడ ఎస్పీగా బింధు మాధవ్, ఎర్రచందనం యాంటి టాస్క్‌ఫోర్స్ ఎస్పీగా సుబ్బారాయుడిని బదిలీ చేశారు. మరోవైపు ఇటీవల తిరుపతిలో వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్ల జారీ ముందు తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు మరణించారు. ఈ నేపథ్యంలో తిరుపతి ఎస్పీపై బదిలీ వేటు పడింది. దాంతో సుబ్బారాయుడుని ఎర్రచందనం యాంటి టాస్క్‌ఫోర్స్ ఎస్పీగా నియమించారు.
అదే విధంగా గ్రేహౌండ్స్ డీజీగా బాబ్జీ, ఏసీబీ డైరెక్టర్‌గా రాజ్యలక్ష్మి, అల్లూరి సీతారామరాజు అదనపు ఎస్పీగా ధీరజ్, సీఐడీ ఎస్పీగా శ్రీదేవిరావు చక్రవర్తి, లీగల్, హ్యూమన్‌రైట్స్ కో ఆర్డినేషన్ ఎస్పీగా సుబ్బారెడ్డి, ఇంటెలిజెన్స్ ఎస్పీగా రామ్మోహన్‌రావు, స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్ డీఐజీగా అంబురాజన్‌లను బదిలీ చేశారు.
మరిన్ని తెలుగు వార్తలు కోసం..
Also Read: కోల్‌కతా వైద్య విద్యార్థిపై హత్యాచారం.. నిందితుడికి జీవిత ఖైదు
Also Read: ట్రంప్ డిన్నర్‌లో నీతా అంబానీ కట్టిన చీర ప్రత్యేకతలు ఇవే..
Also Read: నాగ సాధువులు.. రహస్యాలు
Also Read: ట్రంప్ ప్రమాణ స్వీకారం.. ఈ పుస్తకమే కీలకం
Also Read: మౌని అమావాస్య రోజు ఏం చేయాలి.. ఏం చేయకూడదంటే..?
Also Read: వాట్సప్‌లోనే బర్త్, డెత్ సర్టిఫికేట్లు
For AndhraPradesh News And Telugu News
Updated Date - Jan 20 , 2025 | 09:35 PM