కలెక్టర్ చొరవతో 25 ఏళ్ల దారి సమస్యకు పరిష్కారం
ABN, Publish Date - May 31 , 2025 | 12:04 AM
కలెక్టర్ చామకూరి శ్రీధర్ చొరవతో 25 ఏళ్ల దారి సమస్యకు పరిష్కారం లభించింది.
రైల్వేకోడూరు, మే 30(ఆంధ్రజ్యోతి): కలెక్టర్ చామకూరి శ్రీధర్ చొరవతో 25 ఏళ్ల దారి సమస్యకు పరిష్కారం లభించింది. వివరాలు ఇలా ఉన్నాయి.... రై ల్వేకోడూరు మండలం చియ్యవరం గ్రామ పంచాయి తీ పరిధిలో ఉన్న వడ్డిపల్లె గ్రామస్థులు 25 ఏళ్లుగా దారి సమస్యతో ఇబ్బందిపడేవారు. ఈ దారికి ముం దుగా ఉన్న డీకేటీ భూమిని కొంత మంది ఆక్ర మిం చుకుని కంచె ఏర్పాటు చేయడం వల్ల దారి సమస్య ఏర్పడింది. దీంతో ఈ ఏడాది మార్చి నెలలో పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం అందజేశారు. రైల్వేకోడూరు తహసీల్దార్ మహబూబ్ చాంద్ సమస్యను పరిశీలించారు. నివేదికను కలెక్టర్‌కు పంపారు. కలెక్టర్ పరిశీలించి దారి కల్పించాలని ఆదేశించారు. తహసీల్దార్ దారి సమస్యను పరిష్కరిస్తూ అనుమతి ఇచ్చారు. పోలీస్ రక్షణ మధ్య రెవెన్యూ శాఖ సర్వేయర్, సచివాలయం సర్వేయర్లతో శుక్రవారం దారి ఏర్పాటు చేశారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. దీ ర్ఘకాలిక సమస్యకు పరిష్కారం చూపిన కోడూరు కాగా తహసీల్దార్ మహబూబ్ చాంద్, డి ప్యూటీ తహసీల్దార్ శివకుమార్, సర్వేయర్ బాలసుబ్రహ్మణ్యం, కలెక్టర్, జాయింట్ కలెక్టర్, రాజంపేట సబ్ కలెక్టర్‌లను చియ్యవరం వడ్డిపల్లె గ్రామస్థులు అభినందించారు. కాగా టీడీపీ ఇనచార్జ్, కుడా చైర్మన ముక్కా రూపానందరెడ్డి సహకారంతో అధికారులు ప్రత్యేకంగా స్పందించారని గ్రామస్థులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - May 31 , 2025 | 12:04 AM