మేలో 23.77 లక్షల మందికి శ్రీవారి దర్శనం
ABN, Publish Date - Jun 02 , 2025 | 02:36 AM
మే నెలలో 23.77 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ.106.83 కోట్ల కానుకలు అందాయి. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల క్షేత్రం భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్న విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో నెలారంభంలో కొంత భక్తుల రద్దీ సాధారణంగానే కనిపించినా రెండో వారం నుంచీ పెరిగింది. దీంతో పదిరోజులు 80 వేల మందికిపైగా దర్శించుకోగా, 24వ తేదీ 90,211 మంది, 25న 91,538 మంది, 31వ తేదీన 95,080 మంది భక్తులు రికార్డుస్థాయిలో స్వామిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం కూడా మూడురోజులు రూ.4 కోట్లు దాటగా, 26వ తేదీన రూ.5.09 కోట్లు లభించింది. వేసవి నేపథ్యంలో సామాన్యులకు ప్రాఽధాన్యం కల్పించాలనే ఉద్దేశంతో సిఫార్సు వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. దీంతో భారీ సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకోగలిగారు. మే నెలలో మూడుసార్లు 90 వేలకు పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం వెనుక అధికారులు, సిబ్బంది విశేష కృషి కనిపిస్తోంది. క్యూల నిర్వహణ, వీఐపీ బ్రేక్‌లో శ్రీవాణి దాతలున్నా అధిక సంఖ్యలో భక్తులకు దర్శనం చేయించడం గమనార్హం.
ఫ హుండీ ద్వారా అందిన కానుకలు రూ.106.83 కోట్లు
తిరుమల, జూన్1(ఆంధ్రజ్యోతి): మే నెలలో 23.77 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ.106.83 కోట్ల కానుకలు అందాయి. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల క్షేత్రం భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్న విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో నెలారంభంలో కొంత భక్తుల రద్దీ సాధారణంగానే కనిపించినా రెండో వారం నుంచీ పెరిగింది. దీంతో పదిరోజులు 80 వేల మందికిపైగా దర్శించుకోగా, 24వ తేదీ 90,211 మంది, 25న 91,538 మంది, 31వ తేదీన 95,080 మంది భక్తులు రికార్డుస్థాయిలో స్వామిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం కూడా మూడురోజులు రూ.4 కోట్లు దాటగా, 26వ తేదీన రూ.5.09 కోట్లు లభించింది. వేసవి నేపథ్యంలో సామాన్యులకు ప్రాఽధాన్యం కల్పించాలనే ఉద్దేశంతో సిఫార్సు వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. దీంతో భారీ సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకోగలిగారు. మే నెలలో మూడుసార్లు 90 వేలకు పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం వెనుక అధికారులు, సిబ్బంది విశేష కృషి కనిపిస్తోంది. క్యూల నిర్వహణ, వీఐపీ బ్రేక్‌లో శ్రీవాణి దాతలున్నా అధిక సంఖ్యలో భక్తులకు దర్శనం చేయించడం గమనార్హం. అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదేశాలతో వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు, విజిలెన్స్ సిబ్బంది, శ్రీవారి సేవకులు క్యూలైన్ల వద్దే ఉండి పర్యవేక్షించారు. దీంతో ఎలాంటి తోపులాటలు, తొక్కిసలాటల ఘటనలు చోటుచేసుకోలేదు. ప్రస్తుతం వేసవి సెలవులు ముగుస్తున్న క్రమంలో రద్దీ ఇంకా పెరిగే అవకాశం ఉందని, అధికారులు సెలవులు తీసుకోకుండా భక్తులకు సేవలందించాలని చైర్మన్, ఈవో ఆదేశాలు జారీ చేశారు.
Updated Date - Jun 02 , 2025 | 02:36 AM