Markapur Railway Station : ఓవర్‌లోడ్‌తో లిఫ్ట్‌లో ఇరుక్కున్న భక్తులు
ABN, Publish Date - Feb 03 , 2025 | 04:30 AM
లిఫ్టులో ఇరుక్కుపోయిన 14 మంది ప్రయాణికులు మూడు గంటలపాటు నరకయాతన అనుభవించారు.
మార్కాపురం రైల్వే స్టేషన్లో 3 గంటలపాటు నరకయాతన
మార్కాపురం రూరల్, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): లిఫ్టులో ఇరుక్కుపోయిన 14 మంది ప్రయాణికులు మూడు గంటలపాటు నరకయాతన అనుభవించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం రోడ్డు రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకొందీ ఘటన. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పలువురు భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం శ్రీశైలం వెళ్లేందుకు తిరుపతి నుంచి మార్కాపురం వచ్చే రైలెక్కారు. ఆదివారం వేకువజామున 4 గంటలకు మార్కాపురం రోడ్డు స్టేషన్‌లో రైలు దిగి, ప్లాట్‌ఫాం నుంచి వెలుపలకు వచ్చేందుకు అక్కడి లిఫ్ట్ ఎక్కారు. అది మధ్యలో మొరాయించింది. రైల్వే పోలీసుల సాయంతో మూడు గంటలపాటు శ్రమించి వారిని ఉదయం 7 గటలకు బయటికి తీశారు. లిఫ్ట్ సామర్థ్యం ఎనిమిది మంది కాగా 14 మంది ఎక్కారు. వారి లగేజీ కూడా ఉండడంతో ఓవర్‌లోడ్ కారణంగా లిఫ్ట్ మధ్యలో నిలిచినట్లు సాంకేతిక సిబ్బంది తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
Drunk Man : ముద్రగడ నివాసంలో ఓ తాగుబోతు భీభత్సం...
Botsa Satyanarayana: ఉత్తరాంధ్రతోపాటు సీమకు అన్యాయం
Kondapalli Srinivas: అద్భుతం.. అస్సలు ఊహించలేదు.. బడ్జెట్‌పై మంత్రి కీలక వ్యాఖ్యలు
Read Latest AP News and Telugu News
Updated Date - Feb 03 , 2025 | 04:30 AM