Polavaram Project: నిర్వాసితులకు పశ్చిమ ఏజెన్సీలో భూములు
ABN, Publish Date - May 28 , 2025 | 06:05 AM
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వలన చింతూరు ఐటీడీఏ పరిధిలోని 13,700 మంది గిరిజనులు నిర్వాసితులయ్యారు. వీరి కోసం పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో వ్యవసాయానికి అనుకూలమైన భూములు సేకరిస్తున్నట్లు ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ వి.అభిషేక్ తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ర్టేటర్ అభిషేక్
బుట్టాయగూడెం, మే 17(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వలన నిర్వాసితులుగా మారుతున్న చింతూరు ఐటీడీఏ పరిధిలోని గిరిజనుల కోసం పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో భూముల సేకరిస్తున్నట్టు ప్రాజెక్టు అడ్మినిస్ర్టేటర్ వి.అభిషేక్ తెలిపారు. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం వచ్చిన ఆయన రెవెన్యూ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగా పోలవరం ప్రాజెక్టు ఫేజ్-1(బి)లో 2022లో గోదావరికి వచ్చిన వరదల కారణంగా చింతూరు ఐటీడీఏ పరిధిలోని 32 గిరిజన గ్రామాలకు చెందిన 13,700 మంది నిర్వాసితులుగా మారారని తెలిపారు. చింతూరు ఐటీడీఏ పరిధిల ో 48 గ్రామాలు వరదల ప్రభావానికి గురికాగా 32 గ్రామాల ప్రజలను తరలిం చేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ ఆదేశాల మేరకు మంగళవారం బుట్టాయగూడెం మండలంలోని రెడ్డిగణపవరం ప్రాంతంలోని భూములను చూసుకోడానికి 38 మంది నిర్వాసితులు వచ్చినట్టు తెలిపారు. వ్యవసాయానికి అనుకూలమైన భూములనే నిర్వాసితులకు చూపుతు న్నామని, గిరిజనులు రాతపూర్వకంగా అంగీకరిస్తేనే కొనుగోలు చేస్తామన్నారు. రెవెన్యూ అధికారులు దగ్గరుండి నిర్వాసితులకు భూములను చూపిస్తారని ముఖాముఖిగా వారితో మాట్లాడి అంగీకారం తెలిపిన తరువాతే చర్యలు చేపడ తామన్నారు. చింతూరు ఐటీడీఏ పరిధిలో భూములు కోల్పోతున్న గిరిజ నులం దరికీ రెండున్నర ఎకరాల భూమిని ఇవ్వనున్నట్టు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే
అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్‌కు లోకేష్ సవాల్
Read Latest AP News And Telugu News
Updated Date - May 28 , 2025 | 06:05 AM