West Godavari District: స్వదేశానికి 12 మంది గోదావరి యువకులు
ABN, Publish Date - Jul 28 , 2025 | 04:52 AM
దుబాయిలో భవనాలకు రంగులు వేసే ఒక సంస్థలో పెయింటర్లుగా పని చేయడానికి వచ్చి పని విషయమై యాజమానితో ఏర్పడిన వివాదంలో.. 14 మంది పశ్చిమ గోదావరి జిల్లా యువకులు ఆదివారం స్వదేశానికి వెళ్లారు.
దుబాయిలో యాజమానితో పని వివాదం
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
దుబాయిలో భవనాలకు రంగులు వేసే ఒక సంస్థలో పెయింటర్లుగా పని చేయడానికి వచ్చి పని విషయమై యాజమానితో ఏర్పడిన వివాదంలో.. 14 మంది పశ్చిమ గోదావరి జిల్లా యువకులు ఆదివారం స్వదేశానికి వెళ్లారు. దుబాయిలోని వీధుల్లో పని ప్రదేశాల వద్ద తీవ్ర ఎండల కారణంగా ఈ యువకులు నానా అవస్థలు పడ్డారు. అయినా యజమాని వీరిపట్ల కఠినంగా వ్యవహరించడంతో తాము వెనక్కి వెళ్లిపోతామని మొరపెట్టుకున్నారు. అయినా యజమాని స్పందించలేదు. దీంతో వీరి అవస్థలపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించగా, ఏపీ ఎన్నార్టీ అధికారులు స్పందించి వీరికి అండగా నిలిచారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చేసిన సూచనతో వీరిని దుబాయికి పంపించిన దళారీ.. వీరిని వెనక్కి రప్పించారు. రాస్ అల్ ఖైమా నుంచి ముంబాయి మీదుగా హైద్రాబాద్‌కు వీరు చేరుకున్నారు. ‘ఆంధ్రజ్యోతి’లో కథనం అనంతరం దుబాయిలోని వాసవీ క్లబ్‌తో పాటు అనేక మంది దాతలు వీరికి సహాయం చేయడానికి ముందుకొచ్చారు. దుబాయిలోని సామాజిక కార్యకర్త తరపట్ల మోహన్ అటు దుబాయి అధికారులు, కంపెనీ యాజమాన్యం, ఇటు ఏపీ ఎన్నార్టీ అధికారులతో సంప్రదింపులు జరిపి వీరిని స్వదేశానికి పంపించడంలో కీలక పాత్ర వహించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీలో పెట్టుబడులకు సింగపూర్ గ్రీన్ సిగ్నల్.. ప్రధానంగా ఈ రంగాల్లో
బద్వేల్‌లో ఉప ఎన్నిక.. ఆదినారాయణరెడ్డి ఏమన్నారంటే..
Read latest AP News And Telugu News
Updated Date - Jul 28 , 2025 | 04:55 AM