Minister Narayana: 10 లక్షల కోట్ల అప్పులు.. 85 లక్షల టన్నుల చెత్త
ABN, Publish Date - Jul 19 , 2025 | 05:42 AM
వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్లు అప్పులు, 85 లక్షల టన్నుల చెత్తను కట్టబెట్టారని మంత్రి పొంగూరు నారాయణ విమర్శించారు.
వైసీపీ ఐదేళ్ల పాలనా నిర్వాకమిది: మంత్రి నారాయణ ఫైర్
అనంతపురం క్లాక్ టవర్, జూలై 18(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్లు అప్పులు, 85 లక్షల టన్నుల చెత్తను కట్టబెట్టారని మంత్రి పొంగూరు నారాయణ విమర్శించారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని డంపింగ్ యార్డులో లెగసీ బయోమైనింగ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి పోయినా, కేంద్ర ప్రభుత్వ సహకారంతో సీఎం చంద్రబాబు సంక్షేమం, అభివృద్ధిని పరుగు లు పెట్టిస్తున్నారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించిన వైసీపీ ప్రభుత్వం.. రూ.10 లక్షల కోట్ల అప్పులను మిగిల్చిందని మండిపడ్డారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజల నుంచి చెత్తపై పన్ను వసూలు చేశారని, అయినా రాష్ట్ర వ్యాప్తంగా 85 లక్షల టన్నుల చెత్తను డంపింగ్ యార్డుల్లోనే ఉంచారని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అక్టోబరు 2 నాటికి డంపింగ్ యార్డుల్లో చెత్త లేకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
Updated Date - Jul 19 , 2025 | 05:44 AM