ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

YS Sharmila: అది లక్ష కోట్ల లిక్కర్‌ స్కాం

ABN, Publish Date - Jul 25 , 2025 | 04:18 AM

మద్యం కుంభకోణం కేవలం మూడున్నర వేల కోట్ల అవినీతి కాదని, అది లక్ష కోట్ల స్కాం అని పీసీసీ చీఫ్‌ షర్మిల అన్నారు.

  • జనం ఆరోగ్యంతో జగన్‌ చెలగాటమాడారు

  • అమ్మకాలు నగదు లావాదేవీల్లోనే ఎందుకు? దీనికి జగన్‌ సూటిగా జవాబు చెప్పాలి

  • వివేకా గుండెపోటుతో చనిపోయారని తన చానల్‌లో ఎందుకు ప్రసారం చేశారో కూడా జగన్‌ నోరు విప్పాలి

  • సిట్‌ దర్యాప్తు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉంది

  • ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజం

అమరావతి, జూలై 24(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేవలం మూడున్నర వేల కోట్ల అవినీతి కాదని, అది లక్ష కోట్ల స్కాం అని పీసీసీ చీఫ్‌ షర్మిల అన్నారు. ఇదో పెద్ద ఆర్థిక నేరమని ఆమె వ్యాఖ్యానించారు. దేశమంతా డిజిటల్‌ పేమెంట్స్‌ చేయాలంటూ ప్రచారం చేస్తుంటే, రాష్ట్రంలో మద్యం అమ్మకాలు మాత్రం నగదు లావాదేవీల్లోనే ఎందుకు చేశారో వైసీపీ అధినేత జగన్‌ సూటిగా సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. పన్ను రహిత మద్యాన్ని భారీగా అమ్మడం కోసమే నగదు లావాదేవీల్లో విక్రయాలు చేశారని షర్మిల అన్నారు. ఇది లక్ష కోట్ల రూపాయల స్కాం అని ముఖ్యమంత్రి చంద్రబాబే అసెంబ్లీలో ప్రకటించిన శ్వేతపత్రంలో పేర్కొన్నారని షర్మిల గుర్తు చేశారు. ఇప్పుడు మూడున్నర వేల కోట్ల రూపాయల అక్రమాలని చెబుతున్నారని దీనిపై ప్రభుత్వం స్పందించాలని ఆమె డిమాండ్‌ చేశారు. ప్రజల ఆరోగ్యానికి హానికరమైన మద్యం బ్రాండ్లను ప్రోత్సహించిన జగన్‌ ప్రభుత్వం తీరుతో లక్షలాది మంది... కిడ్నీ, లివర్‌లు చెడిపోవడం, నరాల బలహీనత తదితర వ్యాధులకు గురయ్యారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 30 వేల మంది నాసిరకం మద్యం తాగి అనారోగ్యానికి గురై ప్రాణాలు పోగొట్టుకున్నారని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయని షర్మిల అన్నారు. దీనిపై సిట్‌ ఎందుకు దృష్టి పెట్టడం లేదని ఆమె ప్రశ్నించారు. ట్రస్టెడ్‌ కంపెనీల లిక్కర్‌ను ఎందుకు నిషేధించారో ప్రజలకు తెలియాల్సి ఉందని అన్నారు. తనకు అనుకూలమైన విషయాలను మాత్రమే మాట్లాడే జగన్‌... రుషికొండను ఎందుకు తవ్వారో.. భవనాలు ఎందుకు కట్టారో ఏనాడూ చెప్పలేదని షర్మిల వ్యాఖ్యానించారు.

వివేకానందరెడ్డి హత్య విషయంలోనూ సాక్షి పత్రిక గుండెపోటు అని చెబితే.. దానిపై కూడా జగన్‌ ఏనాడూ నోరు విప్పలేదని, గంగవరం పోర్టును ఎందుకు అదానీకి అమ్మారని ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెప్పలేదని షర్మిల ధ్వజమెత్తారు. మద్యం కేసులో జగన్‌ను అరెస్టు చేస్తారా లేదా అనేది చూడాలని, మద్యం కేసులో సిట్‌ విచారణ కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉందని ఆమె అన్నారు. ఎంతసేపూ డిస్టిలరీల చుట్టే విచారణ సాగుతోందని ఆమె అసహనం వ్యక్తం చేశారు. నెలకు రూ.50 నుంచి రూ.60 కోట్ల దాకా ముడుపులు అందాయని సిట్‌ అధికారులు చెబుతున్నారని, అయితే, లిక్కర్‌ స్కామ్‌ రూ.3500 కోట్లకే పరిమితం కాదని, డిస్టిలరీ నుంచి వినియోగదారుడికి మద్యం చేరే వరకూ ప్రతి విషయంపైనా దర్యాప్తు జరగాలని డిమాండ్‌ చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

YS Sharmila: మద్యం స్కామ్ వెనుక ఉన్న కుట్ర కోణాలు వెలికి తీయాలి

Hari Hara Veeramallu: సీఎం చంద్రబాబుకు హరిహర వీరమల్లు థ్యాంక్స్..

Read latest AP News And Telugu News

Updated Date - Jul 25 , 2025 | 04:18 AM