ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ABN Effect.. వైసీపీ రూ. 5 కోట్ల స్కామ్ గుట్టురట్టు..

ABN, Publish Date - Aug 29 , 2024 | 12:57 PM

కర్నూలు జిల్లా: జగన్ పాలనలో వైసీపీ నేతల చెత్త పని బయటపడింది. చెత్త తొలగింపు శుద్దీకరణ జరగకపోయినా రూ. 5 కోట్లు నొక్కేసేందుకు అప్పట్లో వైసీపీ వేసిన ప్లాన్‌ను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. డంప్ యార్డు పరిస్థితి ఇప్పుడు కూడా మెరుగుపడలేదు. చెత్త పేరుకుపోవడంతో ఇకపై ఎక్కడ పడేయాలో అర్ధం కావడంలేదు.

కర్నూలు జిల్లా: జగన్ పాలనలో వైసీపీ నేతల చెత్త పని బయటపడింది. చెత్త తొలగింపు శుద్దీకరణ జరగకపోయినా రూ. 5 కోట్లు నొక్కేసేందుకు అప్పట్లో వైసీపీ వేసిన ప్లాన్‌ను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. డంప్ యార్డు పరిస్థితి ఇప్పుడు కూడా మెరుగుపడలేదు. చెత్త పేరుకుపోవడంతో ఇకపై ఎక్కడ పడేయాలో అర్ధం కావడంలేదు.


నంద్యాల శివారులోని 13 ఎకరాల్లో డంప్ యార్డు ఉంది. స్వచ్చంధ కార్పొరేషన్ కింద చెత్త శుద్ది ప్రక్రియకు గత జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత ఏడాది జనవరిలో ఎమ్మెల్యే శిల్ప రవి కిషోర్ రెడ్డి చెత్త శుద్ధి పనులను ప్రారంభించారు. 66వేల మెట్రిక్ టన్నుల చెత్తను శుద్ది చేసే కాంట్రాక్టును ముంబైకు చెందిన సాగర్ మోటార్స్‌కు ఇచ్చారు సదరు మోటారు కంపెనీ నంద్యాల యార్డులోని తడి, పొడి చెత్తను శుద్ధి చేయాల్సి ఉంటుంది. గడువు ప్రకారం మూడు నెలల్లో చెత్త శుద్ధి ప్రక్రియను పూర్తి చేయాలి. తడి చెత్త ద్వారా రైతులకు ఉపయోగపడేలా వర్మి కంపోస్ట్, అలాగే పొడి చెత్తనుంచి మట్టి, ప్లాస్టిక్, గాజు వంటివి వేరు చేయాలి. అలా వేరుచేసిన వస్తువులను స్థానిక జిందాల్ ప్యాక్టరీకి తరలించాలి. అయితే ఇప్పటి వరకు రైతులకు వర్మి కంపోస్టును అమ్మడం కానీ.. ప్లాస్టిక్ వ్యర్ధాలను జిందాల్ ఫ్యాక్టరీకి తరలించడం గానీ జరగలేదు. రెండేళ్లవుతున్నా చెత్తశుద్ధి ప్రక్రియ ఒక్క అడుగుకూడా ముందుకు పడలేదు. దీంతో డంప్ యార్డులో చెత్త గుట్టలు గుట్లలుగా పేరుకుపోయింది.


ఈ వార్తలు కూడా చదవండి..

విశాఖ ఎయిర్‌పోర్టులో మంత్రి లోకేష్‌కు ఘన స్వాగతం..

కవితకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం..

జన్వాడ ఫామ్‌హౌస్‌కు అనుమతులు లేవు..

సిగ్గుతో.. జైలు టు బెంగళూర్‌..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 29 , 2024 | 12:57 PM

Advertising
Advertising