జన్వాడ ఫామ్‌హౌస్‌కు అనుమతులు లేవు..

ABN, Publish Date - Aug 29 , 2024 | 09:37 AM

రంగారెడ్డి జిల్లా: జన్వాడలో కేటీఆర్ ఫామ్‌హౌస్‌కు సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని సమాచారం. రంగారెడ్డి జిల్లా, శంకర్‌పల్లి మండలంలోని జన్వాడ ప్రాంతమంతా ట్రిఫుల్ వన్ జీవో పరిధిలో ఉంది. 2013-14 మధ్య ఫామ్‌హౌస్‌ నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీనికి సంబంధించి అప్పటి గ్రామపంచాయతీ కార్యదర్శి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు.

రంగారెడ్డి జిల్లా: జన్వాడలో కేటీఆర్ ఫామ్‌హౌస్‌కు సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని సమాచారం. రంగారెడ్డి జిల్లా, శంకర్‌పల్లి మండలంలోని జన్వాడ ప్రాంతమంతా ట్రిఫుల్ వన్ జీవో పరిధిలో ఉంది. 2013-14 మధ్య ఫామ్‌హౌస్‌ నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీనికి సంబంధించి అప్పటి గ్రామపంచాయతీ కార్యదర్శి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. కానీ ఆ ఇంటికి నెంబర్ కేటాయించి ఏటా పన్ను వసూలు చేస్తుండడం గమనార్హం. సర్వే నెం. 311-7లో 362 గజాల్లో ఇంటి నిర్మాణం ఉన్నట్లు పంచాయతీ రికార్డుల్లో ఉండగా ఫామ్‌హౌస్‌ 1210 గజాల్లో ఉందని విశ్వాసనీయ సమాచారం. 111 జీవో పరిధిలో కాంక్రిట్‌తో నిర్మాణాలు చేపట్టరాదనే నిబంధనలు ఉండగా అందుకు విరుద్ధంగా ఫామ్‌హౌస్‌ను మూడు అంతస్తుల్లో నిర్మించారు. మరోవైపు... జన్వాడ ఫామ్‌ హౌస్‌ వద్ద బుధవారం కూడా రెవెన్యూ అధికారుల సర్వే కొనసాగింది.


చేవెళ్ల రెవెన్యూ డివిజన్‌ సర్వే విభాగం డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ రత్నాకర్‌రావు ఆధ్యర్యంలో శంకర్‌పల్లి ఆర్‌ఐ తేజ, సర్వేయర్‌ సాయితేజ, నీటి పారుదలశాఖ వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ లింగం తదితరులు మియాఖాన్‌గడ్డ నుంచి జన్వాడ ఫామ్‌హౌస్‌ మీదుగా శంకర్‌పల్లి మండల సరిహద్దు వరకు 500మీటర్ల మేర సర్వే చేపట్టారు. డిజిటల్‌ సర్వే (డీజీపీఎస్‌) మిషన్‌తో ఫిరంగి కాలువను పరిశీలించారు. కాలువతో, బఫర్‌ జోన్‌ ప్రాంతం ఏ మేరకు ఆక్రమణకు గురైందనే విషయాన్ని ఆరా తీశారు. ఒకటి రెండు రోజుల్లో మరో సారి సర్వే చేపట్టి, పూర్తి వివరాలతో కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామని అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సిగ్గుతో.. జైలు టు బెంగళూర్‌..

మునిగిన గుజరాత్.. మోదీ భరోసా..

హెల్మెట్లు ధరించిన బస్సు డ్రైవర్లు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 29 , 2024 | 09:37 AM