హెల్మెట్లు ధరించిన బస్సు డ్రైవర్లు
ABN, Publish Date - Aug 29 , 2024 | 07:30 AM
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ 12 గంటలపాటు బంద్ నిర్వహించింది. పలు చోట్ల టీఎంసీ, బీజేపీ నేతల మధ్య ఘర్షణలు జరగ్గా.. బీజేపీ నేతపై కాల్పులు జరగడం కలకలం రేపాయి. బెంగాల్‌లో అత్యాచారం చేసిన నిందితులకు మరణశిక్ష పడే విధంగా చట్టం చేస్తామని ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్పష్టం చేశారు.

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మమత ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసగా బీజేపీ 12 గంటలపాటు బెంగాల్ బంద్ నిర్వహించింది. ర్యాలీలో విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం, బాష్పవాయువు ప్రయోగించడంపట్ల బీజేపీ మండిపడుతూ బంద్ చేపట్టింది. దీంతో పశ్చిమ బెంగాల్ స్తంభించింది. పలుచోట్ల దుకాణాలు మూసివేస్తూ బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. బంద్ కారణంగా బెంగాల్‌లో పలు చోట్ల రవాణా వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది. రైలు పట్టాలపై ఆందోళన కారులు నిరసనకు దిగడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆందోళన నేపథ్యంలో బస్సు డ్రైవర్లు హెల్మెట్లు ధరించి వాహనాలు నడిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారీగా పెరిగిన విద్యార్థుల ఆత్మహత్యలు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Aug 29 , 2024 | 07:30 AM