విశాఖ ఎయిర్‌పోర్టులో మంత్రి లోకేష్‌కు ఘన స్వాగతం..
ABN, Publish Date - Aug 29 , 2024 | 11:15 AM
విశాఖ: రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ బుధవారం రాత్రి విశాఖ విచ్చేశారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి నగరానికి వచ్చిన ఆయనకు విమానాశ్రయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ ఎం.శ్రీభరత్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పి.గణబాబు, బండారు సత్యనారాయణమూర్తి, కేఎస్‌ఎన్‌ఎస్ రాజు, ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు, వేపాడ చిరంజీవిరావు, విశాఖపట్నం, అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గాల పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ, బత్తుల తాతయ్యబాబు, ముఖ్య అధికారులు.. తదితరులు పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు.
1/8
విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు చేరిన మంత్రి నారా లోకేష్‌కు పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలుకుతున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తదితరులు..
2/8
విశాఖ ఎయిర్‌పోర్టులో మంత్రి లోకేష్‌కు పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలుకుతున్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తదితరులు..
3/8
మంత్రి లోకేష్‌కు స్వాగతం పలికేందుకు విశాఖ ఎయిర్‌పోర్టుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు..
4/8
మంత్రి నారా లోకేష్‌కు విశాఖ ఎయిర్పోర్ట్‌లో పుష్పగుచ్చములిచ్చి స్వాగతం పలుకుతున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు..
5/8
విశాఖ ఎయిర్‌పోర్టులో మంత్రి నారా లోకేష్‌తో టీడీపీ నేతలు, వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు తదితరులు..
6/8
మంత్రి లోకేష్‌కు స్వాగతం పలికేందుకు విశాఖ ఎయిర్‌పోర్టుకు తరలివచ్చిన తెలుగుదేశం కార్యకర్తలు..
7/8
తన కోసం విమానాశ్రయానికి వచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలకు నమస్కరిస్తూ వస్తున్న మంత్రి నారా లోకేష్...
8/8
విశాఖ ఎయిర్‌పోర్టులో తన కోసం వచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు నమస్కరించి బయలుదేరుతున్న మంత్రి లోకేష్...
Updated at - Aug 29 , 2024 | 11:15 AM