వైసీపీ ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది..
ABN, Publish Date - Aug 29 , 2024 | 08:55 AM
అమరావతి: పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ ఒకటి అనుకుంటే ఓటర్లు మరొకటి తలచారు. జనసేనాని పవన్ కల్యాణ్‌ను ఓడిస్తామని బీరాలు పలికిన వైసీపీ నేతలు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు. దీంతో ప్యాన్ పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావ చందంగా తయారైంది.
అమరావతి: పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ ఒకటి అనుకుంటే ఓటర్లు మరొకటి తలచారు. జనసేనాని పవన్ కల్యాణ్‌ను ఓడిస్తామని బీరాలు పలికిన వైసీపీ నేతలు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు. దీంతో ప్యాన్ పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావ చందంగా తయారైంది. వలసలతో వైసీపీ దాదాపు ఖాళీ అవుతోంది. ఉన్న నేతలు కూడా ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు. వైసీపీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్ ఉండదనే భయంతో భవిష్యత్ పాలిటిక్స్ కోసం కొత్త దారులు వెతుక్కుంటున్నారు. పవన్ కల్యాణ్‌పై ఓడిపోయిన వైసీపీ నేత వంగా గీత కేడర్‌కు అందుబాటులో లేకుండా పోయారు.
జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్, ఎమ్మెల్యే, రాజ్యసభ ఎంపీ, లోక్ సభ సభ్యురాలు.. ఇలా పలు పదవులు నిర్వహించిన పొలిటికల్ ప్రొఫైల్ వంగా గీత సొంతం. అలాంటి నేత నియోజకవర్గానికి మొహం చాటేయడంతో కేడర్ డీలా పడింది. పార్టీ పరిస్థితిని తలచుకుంటే తమకు నిద్ర పట్టడం లేదనేది వైసీపీలో కొనసాగుతున్న కార్యకర్తల వాయిస్. ద్వితీయ శ్రేణి నేతలు కూడా దీనికి కోరస్ పలుకుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సిగ్గుతో.. జైలు టు బెంగళూర్..
మునిగిన గుజరాత్.. మోదీ భరోసా..
హెల్మెట్లు ధరించిన బస్సు డ్రైవర్లు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Aug 29 , 2024 | 08:55 AM