Hyderabad: ‘ప్రజావాణి’ పునఃప్రారంభం..
ABN, Publish Date - Jun 08 , 2024 | 03:43 AM
సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగియడంతో ప్రజావాణి కార్యక్రమం శుక్రవారం పునఃప్రారంభమైంది. ప్రజాభవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్, ప్రజావాణి ఇన్‌చార్జి జి.చిన్నారెడ్డి, నోడల్ అధికారి దివ్వదేవరాజన్‌లు దరఖాస్తులను స్వీకరించారు.
బేగంపేట, హైదరాబాద్, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగియడంతో ప్రజావాణి కార్యక్రమం శుక్రవారం పునఃప్రారంభమైంది. ప్రజాభవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్, ప్రజావాణి ఇన్‌చార్జి జి.చిన్నారెడ్డి, నోడల్ అధికారి దివ్వదేవరాజన్‌లు దరఖాస్తులను స్వీకరించారు. ఎన్నికల కోడ్ ముగియడంతో పాలనాపరమైన అడ్డంకులు తొలగాయని, కాబట్టి ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరిస్తామని ఈ సందర్భంగా చిన్నారెడ్డి తెలిపారు.
ఎన్నికల కారణంగా మూడు నెలల తర్వాత నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి సమస్యలపై దరఖాస్తులను అందజేశారు. శుక్రవారం మ్తొతం 373 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించిన 120, విద్యాశాఖ, మునిసిపల్ శాఖలకు సంబంధించి చెరో 43, హోం శాఖకు సంబంధించి 29, పౌరసరఫరాల శాఖకు సంబంధించి 18, ఇతర శాఖలకు సంబంధించి 120 దరఖాస్తులు వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపారు.
Updated Date - Jun 08 , 2024 | 03:43 AM