ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jagadish Reddy: బీఆర్‌ఎస్ గుర్తింపు రద్దు చేయలన్న కాంగ్రెస్ ఫిర్యాదుపై మాజీమంత్రి ఆగ్రహం

ABN, Publish Date - Jan 05 , 2024 | 01:51 PM

Telangana: బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలన్న కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదుపై మాజీమంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఇచ్చిన హామీలు గుది బండలయ్యాయని కాంగ్రెస్ పార్టీకి భయం మొదలైందన్నారు. ప్రభుత్వం నడపలేని అయోమయంలో బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని పిచ్చిపిచ్చి ఉత్తరాలు రాస్తున్నారన్నారు.

సూర్యాపేట, జనవరి 5: బీఆర్ఎస్ పార్టీ (BRS) గుర్తింపు రద్దు చేయాలన్న కాంగ్రెస్ (Congress) నాయకుల ఫిర్యాదుపై మాజీమంత్రి జగదీష్ రెడ్డి (Former Minister Jagadish Reddy) తీవ్రంగా మండిపడ్డారు. ఇచ్చిన హామీలు గుది బండలయ్యాయని కాంగ్రెస్ పార్టీకి భయం మొదలైందన్నారు. ప్రభుత్వం నడపలేని అయోమయంలో బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని పిచ్చిపిచ్చి ఉత్తరాలు రాస్తున్నారన్నారు.

అధీకారంలోకి వచ్చేది నమ్మకం లేక ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చారని ముందే చెప్పామన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేయడం కాదు హామీలు అమలు చేయకపోతే ప్రజలు కాంగ్రెస్‌ను రద్దు చేస్తారని హెచ్చరించారు. 200 యూనిట్లు ఉచితమని ముక్కుపిండి బిల్లులు వసూలు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేయడం ఎవ్వరి వల్ల సాధ్యం కాదని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 05 , 2024 | 01:51 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising