ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bhatti Vikramarka: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ఓడించాలి

ABN, Publish Date - Mar 11 , 2024 | 09:34 PM

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ప్రజలు బుద్ది చెప్పాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు. సోమవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు.

భద్రాద్రి కొత్తగూడెం: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ (BRS)కు ప్రజలు బుద్ది చెప్పాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు. సోమవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న పేదల సొంతింటి కలను నెరవేర్చేలా ఇందిరమ్మ పథకమని తెలిపారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని తెలిపారు. ప్రజా పాల లో దరఖాస్తులు నిరంతర ప్రక్రియ అని చెప్పారు. కుహానా వాదులు విమర్శలు చేసినా గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని అన్నారు. పార్టీ మారిన గత పినపాక ఎమ్మెల్యేకి ప్రజలు బుద్ది చెప్పారన్నారు.బీఆర్ఎస్‌కి బుద్ధి చెప్పేలా పార్లమెంట్ ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని అన్నారు. సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మాణం చేసిన భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ రాష్ట్ర ప్రభుత్వానికి భారం కాబోతుందని భట్టి విక్రమార్క అన్నారు.

ఇళ్లు కట్టకుండా బీఆర్ఎస్ మోసం చేసింది: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్లను కట్టకుండా మోసం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) మండిపడ్డారు. కేసీఅర్ ప్రభుత్వం హౌసింగ్ శాఖను అవినీతిమయం చేసిందని ఆరోపించారు. సీతారామ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ని గెలిపించాలి: మంత్రి శ్రీనివాస్‌రెడ్డి

మార్పు కావాలని ప్రజలు కాంగ్రెస్‌ని అధికారంలోకి తెచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని తెలిపారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజల వద్దకే ప్రజా పాలనను అందిస్తామని తెలిపారు. ప్రజా సేవకులుగా పనిచేస్తామని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ని గెలిపించాలని మంత్రి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 11 , 2024 | 09:34 PM

Advertising
Advertising