ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Errabelli: నాపై ఫిర్యాదు, ఆరోపణలు చేసిన శరణ్ చౌదరి ఎవరో తెలియదు

ABN, Publish Date - Mar 26 , 2024 | 12:56 PM

తనపై ఫిర్యాదు, ఆరోపణలు చేసిన శరణ్ చౌదరి ఎవరో తనకు తెలియదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. నేడు ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ.. భూదందాలు, కబ్జాలు చేస్తున్నారని బీజేపీ నుంచి శరణ్ చౌదరిని తొలగించినట్లు.. నకిలీ పత్రాలతో ప్రవాసుల నుంచి డబ్బులు తీసుకొని మోసం చేసినట్లు తెలిసిందన్నారు. శరణ్ చౌదరిపై ఎన్నో కేసులు ఉన్నాయని.. అటువంటి వ్యక్తిని ప్రోత్సహించవద్దన్నారు

హైదరాబాద్: తనపై ఫిర్యాదు, ఆరోపణలు చేసిన శరణ్ చౌదరి ఎవరో తనకు తెలియదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) పేర్కొన్నారు. నేడు ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ.. భూదందాలు, కబ్జాలు చేస్తున్నారని బీజేపీ (BJP) నుంచి శరణ్ చౌదరిని తొలగించినట్లు.. నకిలీ పత్రాలతో ప్రవాసుల నుంచి డబ్బులు తీసుకొని మోసం చేసినట్లు తెలిసిందన్నారు. శరణ్ చౌదరిపై ఎన్నో కేసులు ఉన్నాయని.. అటువంటి వ్యక్తిని ప్రోత్సహించవద్దన్నారు. శరణ్ చౌదరిపై ఫిర్యాదుతో విజయ్ అని ఒక ఎన్ఆర్ఐ (NRI) తన దగ్గరకు వచ్చారన్నారు. తాను పోలీస్ కమిషనర్ వద్దకు పంపానని ఎర్రబెల్లి తెలిపారు.

Congress: రెడ్డా.. వెలమా.. బీసీనా? కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్స్..

విజయ్ తనకు బంధువు అనడం తప్పని.. విజయ్‌ది తన కులం కాదని.. తన ప్రాంతం కాదని ఎర్రబెల్లి పేర్కొన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తనపై ఎలాంటి మచ్చ లేదన్నారు. తనను ఇరికించాలని ఎన్నో ప్రభుత్వాలు ప్రయత్నించినా సాధ్యం కాలేదన్నారు. ప్రజల కోసం తాను పోరాటాలు చేశాను తప్పా ఎక్కడా పొరపాటు చేయలేదన్నారు. తనను ఇబ్బంది పెట్టాలని తనపై తప్పుడు ఫిర్యాదులు చేయిస్తున్నారని ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు. దుగ్యాల ప్రణీత్ రావు గురించి తనకు తెలియదని.. ఆయన బంధువులు తన ఊరిలో ఉన్నారని తెలిసిందని ఎర్రబెల్లి పేర్కొన్నారు.

MLC Kavitha: కవిత కేసులో ముగిసిన వాదనలు.. క్షణ క్షణం ఉత్కంఠ..

ప్రణీత్ రావు కుటుంబం ఏ పార్టీలోఉందో... తనకు ఆయనతో సంబంధం ఉందో లేదో... విచారణ చేస్తే అన్ని విషయాలు తెలుస్తాయి కదా అని ఎర్రబెల్లి పేర్కొన్నారు. పార్టీ మారాలంటూ కొందరి ద్వారా ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు. దయాకర్ రావు తనకు తెలియదని ప్రణీత్ రావు స్టేట్ మెంట్ ఇచ్చారన్నారు. తెలుగుదేశంలో ఉండి కూడా తెలంగాణ కోసం పోరాడానని ఎర్రబెల్లి వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 26 , 2024 | 12:56 PM

Advertising
Advertising