Share News

Congress: రెడ్డా.. వెలమా.. బీసీనా? కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్స్..

ABN , Publish Date - Mar 26 , 2024 | 10:17 AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చాలా తాత్సారం చేసింది. బీఆర్ఎస్ దూకుడు ప్రదర్శించి కనీసం నోటిఫికేషన్ కూడా వెలువడక ముందే అభ్యర్థులను ప్రకటించేసి ప్రచారంలోకి తోసేసింది. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ఫాస్ట్‌గానే ఉంది. 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించేసి చేతులు దులిపేసుకుంది. మరి కాంగ్రెస్? ఇంకా కొన్ని పెండింగ్‌లోనే పెట్టింది.

Congress: రెడ్డా.. వెలమా.. బీసీనా? కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్స్..

కరీంనగర్: తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) సమయంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) చాలా తాత్సారం చేసింది. బీఆర్ఎస్ (BRS) దూకుడు ప్రదర్శించి కనీసం నోటిఫికేషన్ కూడా వెలువడక ముందే అభ్యర్థులను ప్రకటించేసి ప్రచారంలోకి తోసేసింది. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ఫాస్ట్‌గానే ఉంది. 17 పార్లమెంటు (Parliament) నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించేసి చేతులు దులిపేసుకుంది. మరి కాంగ్రెస్ (Congress)? ఇంకా కొన్ని పెండింగ్‌లోనే పెట్టింది. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటు స్థానం విషయంలో కాంగ్రెస్ పార్టీ తెగ ఆలోచిస్తోందని టాక్. కాంగ్రెస్‌ కరీంనగర్‌ అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Drugs: దేశంలోనే అతి పెద్ద డ్రగ్స్ లింక్‌ను ఛేదించిన పంజాగుట్ట పోలీసులు

కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని బరిలోకి దింపాలా? లేదంటే వెలమ సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ కేటాయించాలా? అనే విషయంలో కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోందట. బీఆర్ఎస్, బీజేపీ (BJP) దూకుడు ప్రదర్శిస్తున్నా కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థిని ప్రకటించకుండా తాత్సారం చేస్తోంది. కరీంనగర్ టికెట్ కోసం అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, వెలిచాల రాజేందర్‌రావు, రుద్ర సంతోష్‌కుమార్‌ పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానమైతే ప్రవీణ్ రెడ్డి వైపే మొగ్గు చూపుతోందని ఒక ప్రచారమైతే జరుగుతోంది. అభ్యర్థి విషయమై రేపు లేదా ఎల్లుండి ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. అభ్యర్థి ప్రకటన ఆలస్యంతో క్యాడర్ ఢీలా పడిపోయింది.

Food Adulteration: ఆహార పదార్థాల కల్తీని ఇలా ఈజీగా పసిగట్టేయండి..!

కరీంనగర్‌ స్థానం నుంచి అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, వెలిచాల రాజేందర్‌రావు, రుద్ర సంతోష్‌కుమార్‌ టికెట్‌ కోసం పోటీపడుతున్నారు. ఇక్కడ అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి పేరును ఖరారు చేసినా రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించే సీట్లు ఎక్కువవుతున్నాయనే కారణంగా పెండింగ్‌లో ఉంచారని సమాచారం. వెలమ సామాజికవర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించని నేపథ్యంలో వెలిచాల రాజేందర్‌రావు పేరు ప్రధాన పరిశీలనకు వచ్చినట్లు సమాచారం. బీసీ సామాజిక వర్గానికి చెందిన రుద్ర సంతోష్‌కు సీటు ఇవ్వాలని ఆ సామాజిక వర్గం నేతలు డిమాండ్‌ చేస్తుండడంతో అధిష్ఠానం ఇంకా ఏమి తేల్చుకోలేక ఎంపిక వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాలు అంతర్భాగమై ఉన్న నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం అభ్యర్థి ఎంపిక కూడా పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఇక్కడి నుంచి జిల్లాకే చెందిన ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారు.

MLC Kavitha Arrest: నేటితో ముగియనున్న కవిత కస్టడీ.. తరువాత ఏంటి?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 26 , 2024 | 10:17 AM