Share News

Food Adulteration: ఆహార పదార్థాల కల్తీని ఇలా ఈజీగా పసిగట్టేయండి..!

ABN , Publish Date - Mar 26 , 2024 | 08:38 AM

ప్రస్తుత కాలంలో ఏది చూసినా కల్తీనే కనిపిస్తోంది. కాదేదీ కల్తీకి(Adulterated food) అనర్హం అన్నట్లుగా.. పాల నుంచి తినే ఆహారాల వరకు ప్రతీది కల్తీ చేసి పడేస్తున్నారు దుర్మార్గులు. ఈ కల్తీ ఆహార పదార్థాలు తిని ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో(Hyderabad) కల్తీ వ్యవహారాలు ఎక్కువగా బయటపడుతున్నాయి.

Food Adulteration: ఆహార పదార్థాల కల్తీని ఇలా ఈజీగా పసిగట్టేయండి..!
Food Adulteration

హైదరాబాద్, మార్చి 26: ప్రస్తుత కాలంలో ఏది చూసినా కల్తీనే కనిపిస్తోంది. కాదేదీ కల్తీకి(Adulterated food) అనర్హం అన్నట్లుగా.. పాల నుంచి తినే ఆహారాల వరకు ప్రతీది కల్తీ చేసి పడేస్తున్నారు దుర్మార్గులు. ఈ కల్తీ ఆహార పదార్థాలు తిని ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో(Hyderabad) కల్తీ వ్యవహారాలు ఎక్కువగా బయటపడుతున్నాయి. కల్తీ పదార్థాలతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. గల్లీ హోటల్స్, చిరు వ్యాపారుల నుంచి పెద్ద పెద్ద రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లలోనూ ఈ కల్తీ దందా నడుస్తోంది. దీంతో ఆహార భద్రతా ప్రమాణాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ కల్తీని గుర్తించడం ఎలా? అనేది అందరిలో మెదిలే ప్రశ్న. అందుకే.. కల్తీని గుర్తించేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచించిన పలు సూచనలను మీ ముందుకు తీసుకువచ్చాం. వీటి ఆధారంగా మీరు వినియోగించే ఆహార పదార్థాల కల్తీని గుర్తించొచ్చు.

FSSAI మార్గదర్శకాల ప్రకారం కల్తీ ఆహారాలను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం..

పుచ్చకాయ కల్తీ పరీక్ష:

➥ ముందుగా పుచ్చకాయను రెండు భాగాలుగా కట్ చేయాలి.

➥ ఒక దూది(కాటన్) గానీ, నాప్‌కిన్ పేపర్‌ను గానీ పుచ్చకాయ లోపలి భాగాన్ని రుద్దాలి.

➥ కల్తీ లేకపోతే ఆ కాటన్, నాప్‌‌కిన్ రంగు మారదు.

➥ ఒకవేళ పుచ్చకాయ కల్తీ అయినట్లయితే కాటన్, నాప్‌కిన్ ఎరుపు రంగులోకి మారుతుంది.

ఆకు కూరలు, కూరగాయలు పరీక్ష..

➥ లిక్విడ్ పారాఫిన్‌లో ముంచిన కాటన్ ముక్కను తీసుకోవాలి.

➥ కూరగాయలు, ఆకు కూరల పై భాగంపై ఆ కాటన్‌తో రుద్దాలి.

➥ కాటన్ ఆకు పచ్చగా మారితే అది కల్తీ అయినట్లుగా, దానికి కెమికల్స్ వాడినట్లుగా గుర్తించవచ్చు.

టీ ఆకుల పరీక్ష..

➥ ఫిల్టర్ పేపర్ తీసుకోవాలి.

➥ ఫిల్టర్ పేపర్ మధ్యలో కొన్ని టీ ఆకులను ఉంచాలి.

➥ టీ ఆకుల మీద నీటిని చుక్కల మాదిరిగా వదలాలి.

➥ ఫిల్టర్ పేపర్‌పై రంగు చారలు కనిపిస్తే.. ఆ టీ ఆకులు కల్తీ అయినట్లు భావించొచ్చు.

➥ ఈ ఫిల్టర్ పేపర్‌లో నలుపు-గోధుమ చారలు ఉంటాయి.

చిలగడదుంప పరీక్ష..

➥ నీటిలో లేదా వెజిటబుల్ ఆయిల్‌లో ముంచిన కాటన్ బాల్ తీసుకోండి.

➥ ఆ దూదితో చిలగడదుంప బయటి ఉపరితలంపై రుద్దాలి.

➥ అది ఫ్రెష్‌గా ఉండేందుకు కెమికల్స్ వాడినట్లయితే.. దూది రంగు మారుతుంది.

గ్రీన్ పీస్ పరీక్ష..

➥ ఆక పారదర్శక గ్లాస్‌లో(గాజు గ్లాస్‌, డిస్పోజబుల్ గ్లాస్) తీసుకుని అందులో కొన్ని పచ్చి బఠానీలు వేయాలి.

➥ తరువాత ఆ గ్లాస్‌లో నీరు పోయాలి.

➥ బాగా కలిపి 30 నిమిషాలపాటు వేచి ఉండాలి.

➥ కల్తీ పచ్చి బఠానీలు అయితే ఆ నీరు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది.

కల్తీ ఆహార పదార్థాలను ఎలా గుర్తించాలో మరింత సమాచారం కోసం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ www.fssai.gov.in

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 26 , 2024 | 09:18 AM