Share News

MLC Kavitha Arrest: నేటితో ముగియనున్న కవిత కస్టడీ.. తరువాత ఏంటి?

ABN , Publish Date - Mar 26 , 2024 | 08:50 AM

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత(Kavitha) ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. మంగళవారం ఉదయం 11 గంటలకు ఈడీ(ED) అధికారులు.. కవితను రౌస్ అవెన్యూ కోర్టులో(Rouse Avenue Court) హాజరుపరుచనున్నారు.

MLC Kavitha Arrest: నేటితో ముగియనున్న కవిత కస్టడీ.. తరువాత ఏంటి?
MLC Kavitha

న్యూఢిల్లీ, మార్చి 26: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత(Kavitha) ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. మంగళవారం ఉదయం 11 గంటలకు ఈడీ(ED) అధికారులు.. కవితను రౌస్ అవెన్యూ కోర్టులో(Rouse Avenue Court) హాజరుపరుచనున్నారు. కోర్టు ఈడీ కస్టడీని పొడగిస్తుందా? లేక జ్యూడీషియల్ కస్టడీ విధిస్తారా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు కవిత 10 రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉన్నారు. కవితను 10 రోజులపాటు ఈడీ అధికారులు విచారించారు. లిక్కర్ కేసుకు సబందించిన పలు కీలక విషయాలపై కవితను ప్రశ్నించారు ఈడీ అధికారులు. ఈ విచారణలో కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది.

Also Read: ఆహార పదార్థాల కల్తీని ఇలా ఈజీగా పసిగట్టేయండి..!

మరోవైపు కవితకు బెయిల్ కోసం ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కవిత భర్త అనిల్ ఢిల్లీలోనే ఉన్నారు. ఆమెకు బెయిల్ ఇప్పించడం కోసం లాయర్లు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. మరి కోర్టు ఇవాళ ఆమెకు బెయిల్ మంజూరు చేస్తుందా? లేక ఎలాంటి తీర్పునిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ కోర్టు కవితకు జ్యూడీషియల్ కస్టడీ విధిస్తే.. ఆమెను తీహార్ జైలుకు తరలిస్తారు అధికారులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 26 , 2024 | 08:51 AM