ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

KTR: మా కారు సర్వీసుకు మాత్రమే వెళ్లింది..

ABN, Publish Date - Feb 25 , 2024 | 04:35 PM

అచ్చంపేటలో మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్‌ ఎంపీ నియోజకవర్గ సన్నాహక భేటీలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ..

నాగర్‌కర్నూల్‌: తమ కారు సర్వీసుకు మాత్రమే వెళ్లిందని, మళ్లీ తిరిగి వస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అచ్చంపేటలో ఆదివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్‌ ఎంపీ నియోజకవర్గ సన్నాహక భేటీలో పాల్గొన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పథకాలు ఎగ్గొట్టే కార్యక్రమాలు మొదలుపెట్టిందని విమర్శించారు. గ్రామాల్లో కేసీఆర్‌పై ప్రేమ ఉన్నవారు లక్షల మంది ఉన్నారన్నారు. పదవులు రాలేదని నేతలకు ఉండొచ్చేమో గానీ.. కార్యకర్తలకు లేదని తెలిపారు.

కార్యకర్తలను నేతలు ఏడాదిపాటు కాపాడుకుంటే.. మిగతా నాలుగేళ్లు కార్యకర్తలే నేతలను కాపాడతారని కేటీఆర్ తెలిపారు. పాలమూరు పథకానికి జాతీయ హోదా ఇస్తామని ప్రధాని మోదీ నమ్మబలికారని, అయితే పదేళ్లయినా హోదా ఇవ్వలేదన్నారు. కర్ణాటకలోని అప్పర్‌భద్ర ప్రాజెక్ట్‌కు మాత్రం జాతీయ హోదా ఇచ్చారని గుర్తు చేశారు. కృష్ణానదిపై ప్రాజెక్టులను కాంగ్రెస్.. KRMBకి అప్పగించిందన్నారు. ఈ ప్రాజెక్ట్‌లను కాంగ్రెస్ నేతలు.. ఢిల్లీ చేతిలో పెట్టారని తెలిపారు. ఎక్కడ కోల్పోతే అక్కడే సాధించుకోవాలంటూ పిలుపునిచ్చారు. అలాగే అచ్చంపేటలో పూర్వ వైభవం సాధించుకోవాలని సూచించారు. కేసీఆర్ నాయకత్వంలో 14 ఏళ్లు ఉద్యమం చేశామని.. 24 ఏళ్ల పాటు కారు 100 కి.మీ. వేగంతో జోరుగా వెళ్లిందని, ప్రస్తుతం సర్వీసుకు మాత్రమే వెళ్లిందని, మళ్లీ తిరిగి వస్తుందంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Updated Date - Feb 25 , 2024 | 04:35 PM

Advertising
Advertising