ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CP Tarun Joshi: తనిఖీలు ముమ్మరం.. లోక్‌సభ ఎన్నికలకు పటిష్ట భద్రత

ABN, Publish Date - Apr 27 , 2024 | 11:16 AM

కమిషనరేట్‌ పరిధిలోకి వచ్చే మల్కాజిగిరి, హైదరాబాద్‌, చేవెళ్ల, భువనగిరి, నాగర్‌ కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్‌ జోషి(Rachakonda CP Tarun Joshi) తెలిపారు.

- సీపీ తరుణ్‌ జోషి

హైదరాబాద్‌ సిటీ: కమిషనరేట్‌ పరిధిలోకి వచ్చే మల్కాజిగిరి, హైదరాబాద్‌, చేవెళ్ల, భువనగిరి, నాగర్‌ కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్‌ జోషి(Rachakonda CP Tarun Joshi) తెలిపారు. ఎన్నికల బందోబస్తు విధుల్లో భాగంగా తీసుకోవాల్సిన చర్యల గురించి నాగోల్‌ శ్రియా ఇంజనీరింగ్‌ కాలేజీలో డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఇదికూడా చదవండి: BJP: కాంగ్రెస్‌ను దేశ ప్రజలే నమ్మే పరిస్థితిలో లేరు: బండి సంజయ్

రాచకొండ పరిధిలోని అన్ని జిల్లాల సరిహద్దులు, ప్రధాన రహదారుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని, పోలీసులతోపాటు కేంద్ర సాయుధ బలగాలు విధుల్లో ఉంటాయన్నారు. విస్తృత తనిఖీలు చేపడుతున్నామని వివరించారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్‌ షీటర్‌, హిస్టరీ షీట్‌ ఉన్నవారిని బైండోవర్‌ చేయాలని సిబ్బందికి తెలిపారు. ఈ సమావేశంలో డీసీపీలు రాజేశ్‌ చంద్ర, పద్మజ, ప్రవీణ్‌ కుమార్‌, సునీత రెడ్డి, కరుణాకర్‌, చంద్ర మోహన్‌, మనోహర్‌, ఉష విశ్వనాథ్‌, మురళీధర్‌, అదనపు డీసీపీలు నరసింహారెడ్డి, శ్రీనివాస్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: బస్సు టికెట్‌ ధర నాలుగింతలు పెంచేశారు... రూ. 720 టికెట్‌ 3000కు..

Updated Date - Apr 27 , 2024 | 11:16 AM

Advertising
Advertising