ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhatti Vikramarka: సాగు, సంక్షేమానికి త్వరలో భారీగా నిధులు

ABN, Publish Date - Dec 24 , 2024 | 03:46 AM

వ్యవసాయం, సంక్షేమ రంగాలకు త్వరలో పెద్ద ఎత్తున నిధులను విడుదల చేయనున్నామని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

  • రుణ పంపిణీలో వేగం పెంచాలి

  • వడ్డీ లేకుండా ఏటా 20 వేల కోట్లు

  • కోటి మంది మహిళలను

  • కోటీశ్వరులను చేసే యోచన బ్యాంకర్ల సమావేశంలో భట్టి

హైదరాబాద్‌, డిసెంబరు23(ఆంధ్రజ్యోతి): వ్యవసాయం, సంక్షేమ రంగాలకు త్వరలో పెద్ద ఎత్తున నిధులను విడుదల చేయనున్నామని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. విస్తృతమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో రాబోయే రోజుల్లో ువైబ్రెంట్‌ తెలంగాణ్‌ను చూస్తారని సోమవారం ప్రజాభవన్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం(ఎ్‌సల్‌బీసీ)లో తెలిపారు. రైతులకు రైతు భరోసా ద్వారా, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంక్షేమ పథకాల రూపంలో ప్రభుత్వం రానున్న రోజుల్లో రూ.వేల కోట్లు విడుదల చేయనుందని తెలిపారు. ప్రభుత్వ సబ్సిడీ, మ్యాచింగ్‌ గ్రాంట్‌ పథకాలకు బ్యాంకర్లు పెద్ద మొత్తంలో రుణాలిచ్చేందుకు ుతెలంగాణ రైజింగ్‌్‌ కోణంలో ఆలోచించి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలన్నారు.


వ్యవసాయ రుణాల పంపిణీలో వేగం పెంచాలని, రైతులకు సకాలంలో రుణాలు ఇవ్వకపోతే ప్రయోజనం ఉండదన్నారు. ప్రభుత్వం రెండు నెలల వ్యవధిలోనే రూ.21 వేల కోట్ల రుణ మాఫీ నిధులను బ్యాంకులకు అందజేసిందని, ఈ దృష్ట్యా పంట రుణాలను కూడా లక్ష్యం మేర పూర్తి చేస్తే బాగుంటుందని అన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి సంవత్సరం రూ.20 వేల కోట్ల వడ్డీలేని రుణాలివ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యమని భట్టి తెలిపారు. ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. స్వయం సహాయక సంఘాల(ఎ్‌సహెచ్‌జీ) సభ్యుల ద్వారా 1000 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ఉత్పత్తికి ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని తెలిపారు. గ్రీన్‌ పవర్‌ ఉత్పత్తికి బ్యాంకర్లు పెట్టుబడులు సమకూర్చాలని అన్నారు.


రైతు ప్రయోజనాల కోసమే రుణ లక్ష్యాలుండాలి: తుమ్మల

రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బ్యాంకర్లు రుణ లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఇదే సమావేశంలో ప్రసంగించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. వ్యవసాయ యాంత్రీకరణ ప్రదర్శన ప్రాజెక్టును బ్యాంకర్లు సొంతంగా నిర్వహించే ఏర్పాట్లు చేయాలన్నారు. వ్యవసాయ రంగంలో డ్రోన్‌లను వినియోగించే ప్రణాళికలను రూపొందించుకోవాలన్నారు. ప్రభుత్వపరంగా చేపట్టే అన్ని రకాల పథకాలు, కార్యక్రమాలకు బ్యాంకర్లు తోడ్పాటునందించాలన్నారు.

Updated Date - Dec 24 , 2024 | 03:46 AM