ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tiger Reserve: అమ్రాబాద్‌ అభయారణ్యంలో పెద్ద పులులు 34

ABN, Publish Date - Sep 10 , 2024 | 03:44 AM

రాష్ట్రంలోనే అతిపెద్ద టైగర్‌ రిజర్వ్‌ అమ్రాబాద్‌లో పెద్ద పులుల సంఖ్య 34కు చేరుకుంది. ఈ విషయాన్ని నాగర్‌కర్నూల్‌ జిల్లా అటవీ అధికారి రోహిత్‌ గోపిడి సోమవారం వెల్లడించారు.

  • 180 దాకా చిరుతలు, 22 రకాల వన్యప్రాణులు, 350 రకాల పక్షులు

మన్ననూర్‌, సెప్టెంబరు 9: రాష్ట్రంలోనే అతిపెద్ద టైగర్‌ రిజర్వ్‌ అమ్రాబాద్‌లో పెద్ద పులుల సంఖ్య 34కు చేరుకుంది. ఈ విషయాన్ని నాగర్‌కర్నూల్‌ జిల్లా అటవీ అధికారి రోహిత్‌ గోపిడి సోమవారం వెల్లడించారు. ఇవేగాక అక్కడ 22 రకాల వన్యప్రాణులు, 350 రకాల పక్షులు కూడా ఉన్నట్లు తెలిపారు. అమ్రాబాద్‌ అభయారణ్యంలోని 10 రేంజ్‌లలో 2023 డిసెంబరు 12 నుంచి 2024 మే 2 వరకు 4వ ఫేజ్‌ మానిటరింగ్‌లో భాగంగా 1806 సీసీ కెమెరాలను 4 బ్లాకుల్లో బిగించారు. అచ్చంపేట, కొల్లాపూర్‌, లింగాల రేంజ్‌లను మొదటి బ్లాక్‌గా, అమ్రాబాద్‌, మద్దిమడుగు రేంజ్‌లు రెండవ బ్లాక్‌గా, దోమలపెంట, మన్ననూర్‌ రేంజ్‌లు మూడో బ్లాక్‌, దేవరకొండ, కంబాలపల్లి, నాగార్జునసాగర్‌ రేంజ్‌లు నాలుగో బ్లాక్‌గా విభజించి ట్రాప్‌ కెమెరాలతో మానిటరింగ్‌ చేశారు.


అలాగే 2 కిలోమీటర్లకు ఇద్దరు అధికారుల చొప్పున శాకాహార జంతువుల సర్వే నిర్వహించారు. వీటన్నింటి ఆధారంగా పెద్దపులలు ఇతర వన్యప్రాణుల సంఖ్యను వెల్లడించారు. ఒక్కో సీసీ కెమెరాలో నాలుగు సార్లు నిక్షిప్తం అయిన చిత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకొని, వాటి ఆధారంగా పెద్దపులులను లెక్కిస్తారు. పులిపై ఉండే చారల ఆధారంగా ఒక్కోపులిని లెక్కిస్తారు. ఒక పులికి ఉండే చారలు మరో పులికి ఉండే అవకాశం లేదు. మొత్తంగా 34 పెద్దపులులకు గాను ఆడ 15, మగ 11 కాగా 8 పులి పిల్లలు ఉన్నాయని తెలిపారు.


3వ ఫేజ్‌ మానిటరింగ్‌లో భాగంగా గుర్తించిన 22 పెద్దపులులు ఇక్కడే ఉండగా, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 4 వచ్చి చేరినట్లు గుర్తించారు. పులి పిల్లలు ఆడ, మగను గుర్తించడం అప్పుడే వీలుపడదని అధికారులు తెలిపారు. మరోవైపు, చిరుత పులుల సంఖ్య 163 నుంచి 183 వరకు ఉంటుందని, చుక్కల దుప్పులు 7020 నుంచి 14085 వరకు, సాంబార్లు 3247 నుంచి 5309 వరకు, మనుబోతులు 1733 నుంచి 2347వరకు, కొండగొర్రెలు 285 నుంచి 768 వరకు, అడవి పందులు 3554 నుంచి 8030 వరకు, కొండముచ్చులు 1140 నుంచి 4080 వరకు ఉంటాయని రోహిత్‌ పేర్కొన్నారు.

Updated Date - Sep 10 , 2024 | 03:44 AM

Advertising
Advertising