ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: నేడే ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్.. వీరిపైనే అందరి దృష్టి!

ABN, Publish Date - Mar 22 , 2024 | 07:17 AM

ఐపీఎల్ 2024 (IPL 2024) పోరు నేడు మొదలుకానుంది. ఈ నేపథ్యంలో మొదటి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ సందర్భంగా ప్రధానంగా పలువురు కీలక ఆటగాళ్లపై ఎక్కువ మంది అభిమానులు(fans) ఫోకస్ చేశారు. వారిలో ఎవరెవరు ఉన్నారో ఇక్కడ చుద్దాం.

ఐపీఎల్ 2024 (IPL 2024) పోరు నేడు మొదలుకానుంది. ఈ నేపథ్యంలో మొదటి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్లు తలపడనున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. రెండు జట్లలోనూ మంచి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. ఈ మ్యాచ్ సందర్భంగా ప్రధానంగా పలువురు కీలక ఆటగాళ్లపై ఎక్కువ మంది అభిమానులు(fans) ఫోకస్ చేశారు. వారిలో ఎవరెవరు ఉన్నారో ఇక్కడ చుద్దాం.

1. విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ(virat kohli) 2008 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఉన్నాడు. 2010 నుంచి కోహ్లీ 300 కంటే తక్కువ పరుగులు చేసిన ఒక్క సీజన్ కూడా లేదు. గత సీజన్‌లో కూడా అతను 14 మ్యాచ్‌ల్లో 53.25 సగటుతో 639 పరుగులు చేశాడు. దీన్ని బట్టి కోహ్లి నిలకడను ప్రశ్నించలేమని ఈ గణాంకాలే చెబుతున్నాయి. ఇన్నింగ్స్ స్లోగా ప్రారంభించి చివర్లో అదిరిపోయే విధంగా బ్యాటింగ్ చేస్తూ మ్యాచ్ గమనాన్ని మార్చడం కోహ్లికి అలవాటని చెప్పవచ్చు.

2. మాక్స్‌వెల్

గ్లెన్ మాక్స్‌వెల్(glenn maxwell) క్రికెట్ కెరీర్‌లో ఎక్కువ భాగం వైట్ బాల్ ఫార్మాట్‌కే పరిమతమయ్యారు. అతను ODI లేదా T20 మ్యాచ్‌లు ఆడుతున్నా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా మాక్స్‌వెల్ రెండిటిలోనూ అద్భుతంగా రాణించాడు. బ్యాటింగ్ లోనే కాకుండా బౌలింగ్ లోనూ మ్యాచ్ గమనాన్ని మార్చే సత్తా అతనికి ఉంది. IPL 2023లో అతను 14 మ్యాచ్‌లలో 400 పరుగులు చేశాడు. అతని IPL కెరీర్‌లో 31 వికెట్లు తీసుకున్నాడు.


3. రుతురాజ్ గైక్వాడ్

ఐపీఎల్ 2023లో రుతురాజ్ గైక్వాడ్(ruturaj gaikwad) 16 మ్యాచ్‌లు ఆడి 590 పరుగులు చేశాడు. ఈసారి అతను మునుపటి కంటే మెరుగైన ప్రదర్శన చేస్తాడని భావిస్తున్నారు. MS ధోని CSK కెప్టెన్సీని వదిలిపెట్టి, రితురాజ్ గైక్వాడ్‌కు జట్టు కమాండ్‌ని అప్పగించినందున ఇప్పుడు అందరి కళ్ళు అతనిపైనే ఉన్నాయి.

4. రచిన్ రవీంద్ర

ICC ODI క్రికెట్ ప్రపంచ కప్ 2023 సందర్భంగా రచిన్ రవీంద్ర(rachin ravindra) మొదటిసారిగా వెలుగులోకి వచ్చాడు. ప్రపంచకప్‌లో 10 మ్యాచ్‌ల్లో 578 పరుగులు చేయడంతో పాటు స్పిన్ బౌలింగ్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. IPL 2024 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ అతనిని రూ. 1.8 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో రచిన్ కూడా హాట్ టాపిక్‌గా మారాడు.

5. మహ్మద్ సిరాజ్

మహ్మద్ సిరాజ్(mohammed siraj) IPL 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మెయిన్ ఫాస్ట్ బౌలర్. గత సీజన్‌లో ఆడిన 14 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీశాడు. సిరాజ్ బౌలింగ్ ద్వారా జట్టును కీలక మ్యాచుల్లో గెలిచేలా చేశాడు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: IPL 2024: నేటినుంచి ఐపీఎల్‌ క్రికెట్‌ పండుగ.. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీతో తలపడనున్న సీఎస్కే

Updated Date - Mar 22 , 2024 | 07:18 AM

Advertising
Advertising