ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు ఆ సమస్య.. విరుచుకుపడ్డ స్టార్

ABN, Publish Date - Apr 21 , 2024 | 07:16 AM

ఐపీఎల్-2024 ప్రారంభమైనప్పటి నుంచి హార్దిక్ పాండ్యా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రోహిత్ శర్మ స్థానంలో అతడ్ని ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా నియమించడం.. చాలామంది అభిమానులకు నచ్చలేదు. అందుకే.. పాండ్యా టాస్ కోసం వచ్చిన ప్రతిసారి...

Former Indian Cricketer Slams Hardik Pandya Trolls

ఐపీఎల్-2024 (IPL 2024) ప్రారంభమైనప్పటి నుంచి హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రోహిత్ శర్మ (Rohit Sharma) స్థానంలో అతడ్ని ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కెప్టెన్‌గా నియమించడం.. చాలామంది అభిమానులకు నచ్చలేదు. అందుకే.. పాండ్యా టాస్ కోసం వచ్చిన ప్రతిసారి, అలాగే ఫీల్డ్‌లో తప్పులు చేసినప్పుడల్లా అతనికి అవమానాలే ఎదురవుతున్నాయి. దీనికితోడు పెర్ఫార్మెన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో.. అతడ్ని మరింత తిట్టిపోస్తున్నారు. ఈ ట్రోల్స్‌పై ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీక.. చిరునవ్వు నవ్వుతూ కనిపిస్తున్నాడంతే! ఈ నేపథ్యంలోనే మాజీలు, సీనియర్లు అతనికి మద్దతుగా నిలుస్తున్నారు.


20 World Cup: భారత టీ20 వరల్డ్‌కప్‌ జట్టులో పది మంది ఫిక్స్.. వారికి నో ఛాన్స్!

ఇప్పుడు తాజాగా భారత మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప (Robin Uthappa) ఆ భారత ఆల్‌రౌండర్‌కి అండగా నిలిచాడు. అతని విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘భారత జట్టుకు ఆల్-టైమ్ గ్రేట్‌గా ఉండగల సామర్థ్యం హార్దిక్ సొంతం. మొదట్లో హార్దిక్‌ని ఒక ఫ్రాంచైజీ వదిలిపెట్టింది. ఆ తర్వాత అతడు మరో ఫ్రాంచైజీలో చేరాడు. ఆ జట్టు నాలుగైదు టైటిల్స్‌ని సొంతం చేసుకుంది. అక్కడి నుంచి అతను గుజరాత్ టైటాన్స్‌లో చేరాడు. తొలి సీజన్‌లోనే కెప్టెన్‌గా ఆ జట్టుకి టైటిల్ తెచ్చిపెట్టాడు. రెండో సీజన్‌లో రన్నరప్‌గా నిలబెట్టాడు. అప్పటి నుంచే అసలు కథ మొదలైంది. హార్దిక్‌ని వెక్కిరించడం, ఫిట్‌నెస్‌పై ట్రోల్ చేయడం.. అతడ్ని బాధిస్తుందని మీకు తెలీదా? ఇలా ట్రోల్ చేస్తే ఏ మనిషికైనా బాధ కలుగుతుంది. తనపై వస్తున్న ఈ విమర్శల కారణంగా హార్దిక మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు’’ అని ఉతప్ప చెప్పుకొచ్చాడు.

Shivam Dube: శివమ్ దూబే చీటింగ్ చేశాడా.. అంపైర్ ఎందుకలా చెక్ చేశాడు?

తన కెరీర్‌ని భద్రపరచుకోవడంలో హార్దిక్ చేసిన పని సరైనదేనని ఉతప్ప తెలిపాడు. క్రికెట్ ఆడటం అనేది ప్యాషన్ అయినప్పటికీ.. తమ పొట్ట నింపేది కూడా అదేనని, కాబట్టి కెరీర్‌ని సెక్యూర్ చేసుకోవడంలో తప్పు లేదని అభిప్రాయపడ్డాడు. ఏది ఏమైనా.. భారతీయులుగా అవతలి వ్యక్తులుగా ప్రేమ చూపించడం మన సంస్కృతి అని, వరల్డ్ కప్ ఓడిన తర్వాత కూడా భారతీయ ఆటగాళ్లను అందరూ రిసీవ్ చేసుకున్నారని గుర్తు చేశాడు. ఒక సమాజంగా, భారతీయులుగా అలాగే ప్రేమగా మెలగాలని సూచించాడు. అంతే తప్ప.. ఇలా ఓ వ్యక్తిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సమంజసం కాదని పేర్కొన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 21 , 2024 | 07:17 AM

Advertising
Advertising