Share News

T20 World Cup: భారత టీ20 వరల్డ్‌కప్‌ జట్టులో పది మంది ఫిక్స్.. వారికి నో ఛాన్స్!

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:32 PM

టీ20 వరల్డ్‌కప్ మెగా టోర్నీ జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తరుణంలో.. భారత సెలక్టర్లు టీమిండియా కూర్పు కోసం కసరత్తులు చేస్తున్నారు. టోర్నీ ఆరంభానికి నెల రోజుల ముందుగానే జట్ల వివరాల్ని సమర్పించాలని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ డెడ్‌లైన్‌ విధించడంతో..

T20 World Cup: భారత టీ20 వరల్డ్‌కప్‌ జట్టులో పది మంది ఫిక్స్.. వారికి నో ఛాన్స్!
India's Probable T20 World Cup Squad

టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) మెగా టోర్నీ జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తరుణంలో.. భారత సెలక్టర్లు టీమిండియా కూర్పు కోసం కసరత్తులు చేస్తున్నారు. టోర్నీ ఆరంభానికి నెల రోజుల ముందుగానే (మే 1వ తేదీలోపు) జట్ల వివరాల్ని సమర్పించాలని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) డెడ్‌లైన్‌ విధించడంతో.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మతో (Rohit Sharma) కలిసి అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ టీమ్ భారత జట్టుని ఫైనల్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడిన జట్టుపై ఓ అంచనాకు వచ్చారని.. వారిలో పది మందిని దాదాపు ఫిక్స్ చేశారని వార్తలు వస్తున్నాయి.

డెడ్ బాడీతో బ్యాంక్‌కి వెళ్లిన మహిళ.. చివరికి ఏమైందంటే?


కెప్టెన్‌​రోహిత్‌ శర్మ సారథ్యంలో స్టార్ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ (Virat Kohli), సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, జస్‌ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజా, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌, కుల్దీప్‌ యాదవ్‌, మహమ్మద్‌ సిరాజ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ తదితరుల పేర్లను సెలక్టర్లు ఖరారు చేశారని సమాచారం. మిగిలిన ఐదు స్థానాలను.. ఐపీఎల్-2024లో భాగంగా తొలి నాలుగు వారాల్లో మంచి ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో భర్తీ చేయాలని సెలక్టర్లు యోచిస్తున్నారట. ఇదే సమయంలో.. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వకూడదని కఠినమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈసారి ప్రయోగాలు చేయకూడదని నిర్ణయించారని, అందుకే ఆటగాళ్ల ఎంపిక విషయంలో సెలక్టర్లు రాజీ పడట్లేదని, కొత్త వాళ్లకు జట్టులో చోటు ఇచ్చేందుకు సుముఖంగా లేరని వార్తలొస్తున్నాయి.

శివమ్ దూబే చీటింగ్ చేశాడా.. అంపైర్ ఎందుకలా చెక్ చేశాడు?

ఈ విషయంపై ఓ బీసీసీఐ అధికారి మాట్లాడుతూ.. ‘‘జట్టు ఎంపిక విషయంలో ఎటువంటి ప్రయోగాలు ఉండవు. బాగా రాణించగల ఆటగాళ్లవైపే సెలక్టర్లు మొగ్గు చూపుతున్నారు. టీ20 ఇంటర్నేషనల్స్, ఐపీఎల్‌లో భారత్ తరఫున నిలకడగా రాణించిన ఆటగాళ్లకు మాత్రమే ప్రాధాన్యం దక్కుతుంది’’ అని తెలిపారు. దీంతో.. మిగిలిన ఆ ఐదు స్థానాలకు భారీ పోటీ నెలకొన్నట్టు అయ్యింది. ఇదే సమయంలో.. రోహిత్, కోహ్లీ కలిసి టీ20 వరల్డ్‌కప్‌లో ఓపెనర్లుగా దిగే అవకాశం ఉందని వాదనలు వినిపిస్తున్నాయి. ఒకరు దూకుడుగానూ, మరొకరు ఆచితూచి ఆడుతూ పరుగులు రాబట్టడంలో దిట్ట కాబట్టి.. వీళ్లిద్దరు ఓపెనర్లుగా దిగితేనే జట్టుకి శుభారంభం లభిస్తుందని భావిస్తున్నారని తెలుస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 20 , 2024 | 01:32 PM