ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: అర్ధనగ్నంగా మారిన ఇద్దరు యువకులు.. హోలీ పేరుతో బైకుపై యువతులను ఎక్కించుకుని మరీ..

ABN, Publish Date - Mar 27 , 2024 | 09:09 PM

ప్రస్తుత సమాజంలో చాలా మంది యువత చెడు అలవాట్లకు బానిసలపై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మరికొందరు ప్రేమ పేరుతో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే. ఇంకొందరు ప్రేమికులు.. రద్దీ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ప్రజల ఆగ్రహానికి గురవుతుంటారు. ఇలాంటి..

ప్రస్తుత సమాజంలో చాలా మంది యువత చెడు అలవాట్లకు బానిసలపై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మరికొందరు ప్రేమ పేరుతో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే. ఇంకొందరు ప్రేమికులు.. రద్దీ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ప్రజల ఆగ్రహానికి గురవుతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, కొందరు యువకులు హోలీ పేరుతో అర్ధనగ్నంగా మారి.. బైకుపై యువతులను ఎక్కించుకుని మరీ అసభ్యకరంగా ప్రవర్తించారు. వీరిని చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) నోయిడాలో ఈ ఘటన చోటు చేసుకుంది. హోలీ (Holi) సందర్భంగా నోయిడాలో యువతీయువకులు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా గడిపారు. అయితే కొందరు మాత్రం వేడుకల పేరుతో హంగామా చేయడం కనిపించింది. ఈ క్రమంలో స్థానిక సి-బ్లాక్ సెక్టార్ సమీపంలో ఇద్దరు యువకులు చేసిన నిర్వాకం అంతా అవాక్కయ్యేలా చేసింది. చొక్కాలు విప్పేసిన యువకులు అందరిపై రంగులు చల్లడమే కాకుండా బైకుపై మధ్యలో ఇద్దరు యువతులను ఎక్కించుకుని మరీ రచ్చరచ్చ చేశారు. బైకుపై నలుగురు ప్రయాణించడమే నేరం అనుకుంటే.. అర్ధనగ్నంగా ఉండడమే కాకుండా యువతులతో అసభ్యకరంగా (Indecent behavior with young women) ప్రవర్తిస్తూ వారు చేసిన నిర్వాకం అందరినీ షాక్‌కు గురి చేసింది.

Viral Video: ఇది అలాంటి ఇలాంటి చిలుక కాదు.. డాక్టర్ చిలుక.. నొప్పి లేకుండానే..

మధ్య మధ్యలో యువతులపై చేయి వేస్తూ, ముద్దులు పెడుతూ వాళ్లు చేసిన నిర్వాకం చూసి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బైకు వెనుక కారులో వెళ్తున్న వారు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో వైరల్ అవడంతో ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. ఇద్దరి కంటే ఎక్కువ ప్రయాణించడం, హెల్మెట్ లేకపోవడంతో పాటూ ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించడంతో రూ.24,500 జరిమానా విధించారు. కాగా, ఈ వీడియో చూసిన నెటిజన్లు.. పండుగల పేరుతో రోడ్లపై ఇలా అసభ్యకరంగా ప్రవర్తించడం ఏంటి.. అంటూ మండిపడుతున్నారు. ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ కొందరు, ‘‘పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: రైల్లో టాయిలెట్ గది పక్కనే నిలబడ్డ యువకుడు.. లోపలి నుంచి బయటికొచ్చిన మహిళలు.. చివరకు షాకింగ్ ట్విస్ట్..

Updated Date - Mar 27 , 2024 | 09:10 PM

Advertising
Advertising