ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: భర్త పోయాక పెద్ద పార్టీ ఇచ్చిన మహిళ! బంధువులకు బహుమతులు! ఎందుకంటే..

ABN, Publish Date - Jun 07 , 2024 | 06:46 PM

భర్త పోయిన తరువాత ఓ మహిళ.. బంధువులు స్నేహితులకు పెద్ద పార్టీ ఇచ్చింది. ఎందుకో తెలిసి జనాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆమె మాతృహృదయం గొప్పదంటూ పొగుడుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: జీవితాంతం తోడుగా ఉండాల్సిన వ్యక్తి అకస్మాత్తుగా కన్నుమూస్తే ఆ వేదన మాటల్లో వర్ణించలేం. జీవితం మొత్తం ఒక్కసారిగా చీకటి మయం అయిపోతుంది. ఇక ఎప్పటికైనా తేరుకోగలమా అనే సందేహం కలుగుతుంది. అమెరికాకు చెందిన ఓ మహిళ కూడా దురదృష్టవశాత్తూ ఇదే స్థితిని ఎదుర్కొంది. భర్త పోయిన వెంటనే ఆమె స్నేహితులు, బంధువులను పిలిచి పెద్ద పార్టీ ఏర్పాటు చేసింది. ఆమె పార్టీ ఆహ్వానం తెలుసుకుని తొలుత అవాక్కైన వారందరూ చివరకు అసలు విషయం తెలిసి కన్నీటిపర్యంతమయ్యారు. ప్రస్తుతం ఈ ఉదంతం వైరల్ (Viral) అవుతోంది.

Viral: ఎంత క్రమశిక్షణ.. ఈ కుక్కను చూసైనా మనుషులకు బుద్ధొస్తే బాగుండును!


అమెరికాలోని అరిజోనా రాష్ట్రానికి చెందిన కేటీ యంగ్‌కు భర్త పిల్లలు ఉన్నారు. అయితే, 40 ఏళ్ల వయసులో ఆమె జీవితంలో అనూహ్య మలుపు తిరిగింది. కేటీ భర్త బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడి మృతి చెందాడు. దీంతో, ఆమె జీవితం ఒక్కసారిగా అంధకార మయం అయిపోయింది. అప్పటికి ఆమెకు 8, 12 ఏళ్ల వయసులో ఉన్న పిల్లలు ఉన్నారు. తండ్రి లేడన్న విషయం తెలిస్తే పిల్లలు భాధను తట్టుకోలేరని కేటీ భావించింది (Wife threw party after husbands death and distributed gifts to guest).


ఈ దుర్వార్తకు వారిని ముందుగా సిద్ధం చేయాలనే ఆలోచనతో ఆమె చివరకు స్నేహితులు, బంధువులను పిలిచి పెద్ద పార్టీ ఇచ్చింది. ఏకంగా 500 మంది హాజరైన ఈ పార్టీలో అతిథులందరికీ కేటీ బహుమతులు కూడా ఇచ్చింది. ఈ సందర్భంగా భర్త మధుర స్మృతులను నెమరేసుకుంది. చివరకు మెల్లగా దుర్వార్తను పిల్లలతో పంచుకుంది. భర్త దూరమైన బాధన దిగమింగుకుంటూ పిల్లల సంతోషం కోసం ఆమె పార్టీ ఏర్పాటు చేసిన తీరు జనాల్ని కదిలించింది.

Read Viral and Telugu News

Updated Date - Jun 07 , 2024 | 06:46 PM

Advertising
Advertising