ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: పెళ్లి మంటపంలో వాటర్ పౌంటెన్‌ని.. ఇంత బాగా ఎవరూ వాడలేరేమో..

ABN, Publish Date - Mar 29 , 2024 | 02:36 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమానికి కొంత మంది గ్రామస్తులు హాజరవుతారు. వారికి ఇలాంటి వివాహానికి రావడం కొత్తేమో గానీ.. అంతా విచిత్రంగా అనిపించినట్లుంది. అందులోనే కళ్యాణ మంటపం ముందువైపు ఏర్పాటు చేసిన వాటర్ పౌంటెన్‌ను చూడగానే..

ప్రస్తుతం వివాహాలు చేసే క్రమంలో చాలా మంది ఖర్చులకు వెనుకాడడం లేదు. కొందరు తమ స్థాయికి మించి ఖర్చు చేస్తూ ఘనంగా ఏర్పాట్లు చేయడం చూస్తూ ఉన్నాం. సినిమా వివాహాల తరహాలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇక మారుమూల ప్రాంత వాసులకైతే ఇలాంటి ఖరీదైన ఏర్పాట్లు కొత్తగా అనిపిస్తుంటాయి. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. తాజాగా, ఓ వివాహ వీడియో తెగ వైరల్ అవుతోంది. పెళ్లిలో ఏర్పాటు చేసిన వాటర్ పౌంటెన్‌ని చూడగానే కొంత మంది గ్రామస్తులకు కొత్తగా అనిపించింది. చివరకు వారు చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమానికి కొంత మంది గ్రామస్తులు హాజరవుతారు. వారికి ఇలాంటి వివాహానికి రావడం కొత్తేమో గానీ.. అంతా విచిత్రంగా అనిపించినట్లుంది. అందులోనే కళ్యాణ మంటపం ముందువైపు ఏర్పాటు చేసిన వాటర్ పౌంటెన్‌ను (water fountain) చూడగానే చేతులు, ప్లేట్లు కడుక్కోవడానికి ఏర్పాటు చేశారేమో అని అనుకున్నారు. దీంతో భోజనాల సమయం మొదలవానే అంతా ప్లేట్లతో అక్కడికి చేరుకుని పౌంటెన్ నీటిలోనే కడుక్కున్నారు.

Viral Video: చేపలు ఎలా పట్టాలో ఈ పక్షికి బాగా తెలిసినట్టుంది.. కష్టపడకుండా చిన్న టెక్నిక్‌తో...

ఇంకొందరు తిన్న ప్లేట్లను కూడా అక్కడే కడిగేశారు. వీరిని చూడగానే అక్కడున్న నిర్వాహకులు.. వాటర్ పౌంటెన్‌ను ఆఫ్ చేశారు. పైకి పొంగుతున్న నీళ్లు ఒక్కసారిగా ఆగిపోవడంతో వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. తర్వాత నిరాశగా అక్కడి నుంచి వెళ్లిపోతారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి ఏర్పాట్లు వీరికి కొత్తగా అనిపించాయోమే’’.. అంటూ కొందరు, ‘‘వాళ్లకు తెలీక చేశారు.. ఎగతాళి చేయకండి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 21వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: తాబేలు పవర్ ఏంటో తెలీక కొరకబోయిన మొసలి.. చివరకు ఏం జరిగిందో చూస్తే..

Updated Date - Mar 29 , 2024 | 02:36 PM

Advertising
Advertising