Viral: మాంజాకు చిక్కుకున్న పావురాయిని కాపాడిన మానవతామూర్తులు!
ABN, Publish Date - Dec 27 , 2024 | 09:19 AM
కరెంటు వైరుకు ఉన్న మాంజాలో ఇరుక్కుని విలవిల్లాడుతున్న ఓ పావురాయిని ఇద్దరు వ్యక్తులు కాపాడిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఇది చూసి జనాలు ఆ మానవతామూర్తులను వేనోళ్ల పొగుడుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పక్కవాడు ఏమైపోతున్నా పట్టించుకోని వాళ్లు ఎక్కువైపోతున్న నేటి జమానాలో కొందరిని చూస్తే మానత్వంపై పోయిన నమ్మకం తిరిగొస్తుంది. సొంత లాభం కొంత మానుకుని..అన్నట్టు సాటి వ్యక్తులను, ఆపదలో ఉన్న జంతువులను కూడా కొందరు ఆదుకుంటూ ఉంటారు. ఈ మానవతామూర్తుల వీడియోలు నెట్టింట కాలుపెట్టిన ప్రతిసారీ జనాలు బ్రహ్మరథం పడుతుంటారు. వేలవేల లైకులు, కామెంట్స్, వ్యూస్‌తో హోరెత్తిస్తుంటారు. అలాంటి మరో వీడియో ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వీడియోలోని మానవతామూర్తులకు జనాలు జేజేలు పలుకుతున్నారు (Viral).
నేపాల్‌లో ఈ ఘటన వెలుగు చూసినట్టు తెలుస్తోంది. నేపాల్ఇన్‌రీల్స్ అనే ఇన్‌స్టా అకౌంట్‌లోఈ వీడియోను పోస్టు చేశారు.
Viral: మీ వల్లే నాకీ జాబ్ వచ్చింది.. భారతీయ సీఈఓపై ప్రశంస
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, కరెంటు వైర్లకు ఉన్న మాంజాకు చిక్కుకుని ఓ పావురం గిలగిల్లాడింది. దాన్నుంచి బయటపడేందుకు విశ్వప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. ప్రాణాలు పోయే దశకు చేరుతున్న తరుణంలో ఇద్దరు వ్యక్తులు దేవతామూర్తుల్లా దాన్ని ఆదుకునేందుకు రంగంలోకి దిగారు.
తొలుత ఓ వ్యక్తి పావురాయి వద్ద కారు నిలిపి దానిపైకి ఎక్కాడు. కానీ పావురాయి అందకపోవడంతో మరో వ్యక్తి రంగంలోకి దిగాడు. అతడి భుజాన ఎక్కిన మొదటి వ్యక్తి మాంజాను కట్ చేసి పావురాయిని చేతిలోకి తీసుకుని కింద నిలబడ్డ వారికి ఇచ్చాడు.
Viral: బ్రిటన్‌లో ఉండలేనంటూ తిరిగొచ్చిన భారతీయ డాక్టర్! కారణం తెలిస్తే..
ఆ తరువాత కింద ఉన్న వారు పావురాయిని చుట్టుకుని ఉన్న మాంజాను జాగ్రత్తగా తొలగించి పావురాయిని విడిపించారు. అంతసేపు మాంజాకు చిక్కుకుని ఉన్నా అదృష్టవశాత్తూ పావురాయికి ఏమీ జరగలేదు. దీంతో, మాంజా చిక్కు నుంచి బయటపడగానే ఎగిరిపోయింది. పావురాయికి ఏమీ కాకపోవడంతో అక్కడున్న వారందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇక ఈ వీడియోపై నెట్టింట కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. పావురాయిని కాపాడిన ఆ ఇద్దరిపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. అసలైన మనుషులంటే వీళ్లే అంటూ వేనోళ్ల పొగిడారు. వారి సేవాతత్పరన గొప్పదని ప్రశంసించారు. ఇలాంటి వారిని చూస్తే మానవత్వంపై పోయిన నమ్మకం తిరిగొస్తుందని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో తెగ ట్రెండింగ్‌లో ఉంది.
Viral: భార్య కోసం వీఆర్ఎస్.. ఫేర్‌వెల్ పార్టీలో మహిళ మృతి
Viral: భర్త నుంచి విడాకుల కోసం సెక్స్ వర్కర్‌ను ఎరగా వేసి మాస్టర్ ప్లాన్!
Updated Date - Dec 27 , 2024 | 09:23 AM