Share News

Viral: మీ వల్లే నాకీ జాబ్ వచ్చింది.. భారతీయ సీఈఓపై ప్రశంస

ABN , Publish Date - Dec 27 , 2024 | 07:11 AM

అమెరికాలో 100కు పైగా ఉద్యోగాలు సృష్టించిన పర్‌ప్లె్క్సిటీ ఏఐ సంస్థ సీఈఓ శ్రీరామ్ కృష్ణన్‌పై సంస్థ ఉద్యోగి ఒకరు ప్రశంసలు కురిపించారు. తన జాబ్‌కు ఆయనే కారణమంటూ ధన్యవాదాలు తెలిపారు.

Viral: మీ వల్లే నాకీ జాబ్ వచ్చింది.. భారతీయ సీఈఓపై ప్రశంస

ఇంటర్నె్ట్ డెస్క్: పర్‌ప్లెక్సిటీ ఏఐ సంస్థ సీఈఓ, అరవింద్ శ్రీనివాస్‌పై ఓ అమెరికన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన వల్లే తనకు జాబ్ వచ్చిందంటూ ధన్యవాదాలు తెలిపారు. అరవింద్ స్థాపించిన పర్‌ప్లెక్సిటీ ఏఐలో చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా ఉన్న డిమిట్రీ షెవెలెంకో ఈ మేరకు తన మనసులో మాటను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. విదేశీయులు అమెరికన్ల ఉద్యోగాలను తన్నుకుపోతున్నారంటూ ప్రస్తుతం విమర్శలు చెలరేగుతున్న సమయంలో ఆయన పోస్టు సంచలనంగా మారింది (Viral).

‘‘నేను ఓ అమెరికన్‌ని. కానీ వీసాపై అమెరికాకు వచ్చిన ఓ భారతీయుడు స్థాపించిన సంస్థలో పనిచేస్తున్నా. అమెరికన్ల కోసం 100పైచిలుకు ఉద్యోగాలు సృష్టించినందుకు ఆయనకు నా ధన్యవాదాలు’’ అని పోస్టు పెట్టారు. ఐఐటీ మద్రాస్‌లో బీటెక్ చేసిన అరవింద్ శ్రీనివాస్ ఈ తరువాత యూసీ బర్కె‌లీలో పైచదువులు చదివారు. 2022లో పర్‌ప్లెక్సిటీ ఏఐని సాధించారు.

Viral: బ్రిటన్‌లో ఉండలేనంటూ తిరిగొచ్చిన భారతీయ డాక్టర్! కారణం తెలిస్తే..


ఏఐ ఆధారిత సెర్చ్ఇంజెన్ రూపొందించిన పర్‌ప్లెక్సిటీ సంస్థ చూస్తుండగానే అమెరికాలో గొప్ప గుర్తింపు సాధించింది. జెఫ్ బెజోస్ లాంటి వ్యాపారవేత్తల మద్దతు కూడగట్టింది. వృత్తి జీవితంలో ఇంత పురోగతి సాధించినా అరవింద్ శ్రీనివాస్ గ్రీన్ కార్డు సాధించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై గతంలో ఎలాన్ మస్క్ కూడా స్పందించారు. వృత్తి నిపుణులు సులభంగా అమెరికాకు వచ్చేలా నిబంధనల్లో సంస్కరణలు తీసుకురావాలని కోరారు.

ఇదిలా ఉంటే షెవెలెంకో పోస్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు అతడిపై విమర్శలు గుప్పించారు. అరవింద్ తన మాతృదేశంలో ఈ సంస్థను ఎందుకు ఏర్పాటు చేయలేదని అన్నారు. మరికొందరు షెవెలెంకోకు మద్దతుగా నిలిచారు. నిపుణులైన వారు వృత్తిజీవితంలో ఎదిగేందుకు, ఏదేశ అభివృద్ధిలోనైనా పాలు పంచుకునేందుకు అవకాశం ఉండాలని అన్నారు. అమెరికా నిర్మాణంలో ఎవరైనా పాలుపంచుకోవచ్చు. ఏ దేశంలో వారు పుట్టారనేది అప్రస్తుతం అని మరో వ్యక్తి చెప్పుకొచ్చారు.

Viral: భార్య కోసం వీఆర్ఎస్.. ఫేర్‌వెల్ పార్టీలో మహిళ మృతి


వీసా వ్యవస్థ కారణంగా గత 25 ఏళ్లల్లో అరవింద్ లాంటి 100 మందిని అమెరికా కోల్పోయి ఉంటుందని కొందరు చెప్పుకొచ్చారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ వైరల్ అవుతోంది. జనాలు షాకయ్యేలా చేస్తోంది. అమెరికా ప్రభుత్వ ఏఐ రంగ సలహాదారుగా శ్రీరామ్ కృష్ణన్ నియమితుడవడంపై కొందరు విమర్శలు ఎక్కుపెడుతున్న విషయం తెలిసిందే. అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాలు వలసొచ్చిన వారు తీసుకుపోతున్నారని కొందరు గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో పర్‌ప్లెక్సిటీ ఏఐ సీఈఓ ఉదంతం తెరపైకి వచ్చింది.

Viral: భర్త నుంచి విడాకుల కోసం సెక్స్ వర్కర్‌ను ఎరగా వేసి మాస్టర్ ప్లాన్!

Read Latest and Viral News

Updated Date - Dec 27 , 2024 | 07:16 AM