ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: గొరిల్లా ఎన్‌క్లోజర్‌లో ఛేజింగ్ సీన్.. అంతా చూస్తుండగానే.. యువతులను వెంబడించడంతో చివరకు..

ABN, Publish Date - Mar 09 , 2024 | 02:22 PM

జంతు ప్రదర్శనశాలల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు మద్యం సేవించి క్రూరమృగాల ఎన్‌క్లోజర్లలోకి చొరబడుతుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు వాటి దాడిలో ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. మరికొన్నిసార్లు కేర్ టేకర్లు కూడా జంతువుల దాడిలో గాయాలపాలవడం చూస్తూ ఉంటాం. ఇలాంటి...

జంతు ప్రదర్శనశాలల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు మద్యం సేవించి క్రూరమృగాల ఎన్‌క్లోజర్లలోకి చొరబడుతుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు వాటి దాడిలో ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. మరికొన్నిసార్లు కేర్ టేకర్లు కూడా జంతువుల దాడిలో గాయాలపాలవడం చూస్తూ ఉంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, గొరిల్లాకు సంబంధించిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. యువతిని టార్గెట్ చేసిన గొరిల్లా అంతా చూస్తుండగానే వెంబడించింది. చివరకు ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. టెక్సాస్‌లోని ఫోర్ట్ వర్త్ జంతు ప్రదర్శనశాలలో (Zoo) ఈ ఘటన చోటు చేసుకుంది. గొరిల్లాలకు ఆహారం అందించేందుక ఎన్‌క్లోజర్‌లో మహిళా జూకీపర్లకు (Women zookeepers) షాకింగ్ అనుభవం ఎదురైంది. నీళ్లు పెట్టే సమయంలో అనుకోకుండా గొరిల్లా (gorilla) వారిని పసిగట్టింది. దీంతో యువతులు తలో వైపు పారిపోయారు. ఓ యువతి అక్కడే ఉన్న గది వద్దకు వెళ్లి తలుపు వేసుకుంది. అయినా గొరిల్లా ఆమె బయటికి వచ్చే వరకూ అక్కడే ఎదురుచూస్తూ ఉంది.

Viral Video: తన పవర్ ఏంటో చూపించిన జిరాఫీ.. సింహం నోటికి చిక్కిన మరో జిరాఫీని ఎలా కాపాడిందో చూస్తే..

ఈ క్రమంలో గొరిల్లా దృష్టి మరల్చిన యువతి.. వేగంగా పరుగెత్తుకుంటూ పక్కకు వెళ్లిపోయింది. అక్కడున్న నీళ్ల బకెట్‌ను గొరిల్లాకు సమీపంలో ఉంచి.. దానికి కనిపించకుండా పారిపోయేందుకు ప్రయత్నిస్తుంది. మరో ఇద్దరు జూకీపర్లను టార్గెట్ చేసిన గొరిల్లా.. అటూ ఇటూ తిరుగుతూ దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఇలా చాలా సేపు అక్కడ సినిమాల్లో కనిపించే ఛేజింగ్ సీన్ తరహా ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: బైకుపై వెళ్తున్న మహిళకు.. చీర సర్దుకోమని చెప్పిన యువతులు.. చివరకు ఆమె ఇచ్చిన సమాధానం ఇదీ..

Updated Date - Mar 09 , 2024 | 02:22 PM

Advertising
Advertising