Share News

Viral Video: బైకుపై వెళ్తున్న మహిళకు.. చీర సర్దుకోమని చెప్పిన యువతులు.. చివరకు ఆమె ఇచ్చిన సమాధానం ఇదీ..

ABN , Publish Date - Mar 08 , 2024 | 09:20 PM

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని ఆనందాన్ని కలిగిస్తుంటాయి. ఇంకొన్ని తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ఇలాంటి ఫన్నీ వీడియోలను రోజూ చూస్తూనే ఉంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. బైకులో వెళ్తున్న ఓ మహిళ...

Viral Video: బైకుపై వెళ్తున్న మహిళకు.. చీర సర్దుకోమని చెప్పిన యువతులు.. చివరకు ఆమె ఇచ్చిన సమాధానం ఇదీ..

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని ఆనందాన్ని కలిగిస్తుంటాయి. ఇంకొన్ని తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ఇలాంటి ఫన్నీ వీడియోలను రోజూ చూస్తూనే ఉంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. బైకులో వెళ్తున్న ఓ మహిళ చీర.. టైరుకు తగులుతుండడాన్ని వెనుక వస్తు్న్న యువతులు గమనించారు. చీర సర్దుకోమని సలహా ఇవ్వడంతో చివరకు ఆమె ఇచ్చిన సమాధానం విని అంతా అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ బైకులో వెళ్తుంటుంది. అయితే మార్గ మధ్యలో ఆమె చీర (saree) కొంగు బైక్ టైరుకు తగులుకుంటుంది. అయినా ఆమె గమనించకుండా తన ధ్యాసలో తాను ఉంటుంది. ఈ క్రమంలో వెనుక స్కూటీలో వస్తున్న యువతులు గమనిస్తారు. వెంటనే వారి బైకు దగ్గరగా వెళ్లి.. ముందున్న మహిళను పిలుస్తూ.. ‘‘చీర చీర’’.. అని అరుస్తూ విషయం చెప్పబోతారు.

Viral Video: ఎంత స్లీపర్ కోచ్ అయితే మాత్రం మరీ ఇదేంటీ.. విచిత్రంగా ఫ్యామిలీ మొత్తం..

అయితే వెనుక ఉన్న యువతులకు అంత సమయం ఇవ్వకుండానే అవతలి వైపు నుంచి సదరు మహిళ.. ‘‘ఇదా.. రూ.1500... రూ.1500లు’’.. అని నవ్వుతూ సమాధానం ఇస్తుంది. దెబ్బకు స్కూటీలో ఉన్న యువతులు.. తెగ నవ్వుకుంటారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఓహో..!! మీకు అలా అర్థమైందా’’.. అంటూ కొందరు, ‘‘ఈమెకు చీరల పిచ్చి ఎక్కువ అనుకుంటా’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral: పెళ్లిరోజు షాకిచ్చిన వధువు.. తన మాజీ భర్తను తోడుగా తీసుకురావాలంటూ.. ఏకంగా వరుడికే చెప్పడంతో.. చివరకు..

Updated Date - Mar 08 , 2024 | 09:20 PM