Share News

Viral Video: వామ్మో..! ఇదెక్కడి ఆటరా బాబోయ్.. ఏకంగా ఎక్సకవేటర్‌తోనే..

ABN , Publish Date - Mar 08 , 2024 | 05:36 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ప్రతి ఒక్కరూ ఏదో రకంగా ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో చిత్రవిచిత్రమైన పనులన్నీ చేసేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు వినూత్న విన్యాసాలు చేస్తుంటే.. మరికొందరు రద్దీ ప్రదేశాల్లో పిచ్చిగా పిచ్చిగా ప్రవరిస్తుంటారు. ఇంకొందరైతే, డేంజరస్ గేమ్స్ ఆడుతూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి...

Viral Video: వామ్మో..! ఇదెక్కడి ఆటరా బాబోయ్.. ఏకంగా ఎక్సకవేటర్‌తోనే..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ప్రతి ఒక్కరూ ఏదో రకంగా ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో చిత్రవిచిత్రమైన పనులన్నీ చేసేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు వినూత్న విన్యాసాలు చేస్తుంటే.. మరికొందరు రద్దీ ప్రదేశాల్లో పిచ్చిగా పిచ్చిగా ప్రవరిస్తుంటారు. ఇంకొందరైతే, డేంజరస్ గేమ్స్ ఆడుతూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఎక్సకవేటర్‌తో ఇద్దరు వ్యక్తులు ఆడిన గేమ్ చూసి అంతా షాక్ అవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు వ్యక్తులు వినూత్నమైన గేమ్ (Innovative game) ఆడేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం వారు ఏకంగా ఎక్సకవేటర్‍నే (Excavator) తీసుకొచ్చారు. దాని చుట్టూ ప్లాస్టిక్ కవర్లను వృత్తాకారంగా పరిచి, వాటిపై నీళ్లు పోశారు. ఎక్సకవేటర్‌కు తాడి కట్టి.. దాని సాయంతో గిరాగిరా తిరగమే ఈ గేమ్ ఉద్దేశం. ఆ తాడును చివరి వరకు ఎవరైతే పట్టుకుని తిరుగుతారో వారే విజేత అన్నమాట. ఈ గేమ్ ఆడేందుకు సిద్ధమైన యువకులు.. తాళ్లు పట్టకుని సిద్ధమవుతారు. ఎక్సకవేటర్ నడుపుతున్న వ్యక్తి ఇంజిన్ స్టార్ట్ చేసి, తొండంతో వారిని చుట్టూ గిరగిరా తిప్పుతాడు.

Optical illusion: ఈ పార్కులో ఓ సింహం దాక్కుంది.. దాన్ని కనిపెట్టగలిగితే మీరే కింగ్..

అయితే ఒక రౌండ్ తిరగ్గానే వారిలో ఓ వ్యక్తి.. ‘‘వామ్మో..! నా వల్ల కాదు బాబోయ్’’.. అనుకుంటూ తాడు వదిలేస్తాడు. రెండో వ్యక్తి మాత్రం తాడును గట్టిగా పట్టుకుని గిరాగిరా తిరుగుతాడు. అయితే ఎక్సకవేటర్ తిరిగే వేగం పెరగడంతో సాధ్యం కాక.. చివరకు వదిలేస్తాడు. చూట్టూ ఉన్న వారు ఈ గేమ్‌ను ఆసక్తిగా తిలకిస్తుంటారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! ఇదెక్కడి గేమ్‌రా నాయనా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి ఆటలు ఆటడం ప్రమాదకరం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Optical illusion: పెయింటింగ్ వేస్తున్న ఈ పిల్లాడి ఫొటోలో పెద్ద తప్పు ఉంది.. అదేంటో చెప్పగలరా..?

Updated Date - Mar 08 , 2024 | 05:36 PM