Share News

Viral Video: ఆటోలో వెళ్తున్న యువతిని ఫోన్ నంబర్ అడిగిన కుర్రాళ్లు.. చివరకు చూస్తుండగానే..

ABN , Publish Date - Mar 07 , 2024 | 02:49 PM

చోరీలు జరిగే తీరు చూస్తే కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంటుంది. చాలా మంది నేరస్థులు పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు ఎంతో తెలివిగా నేరాలు చేస్తుంటారు. కొందరు బెదిరించి మరీ నేరాలకు పాల్పడుతుంటే.. మరికొందరు పట్టపగలు అంతా చూస్తుంగానే.. ఎవరికీ ఏమాత్రం అనుమానం రాకుండా నేరాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి...

Viral Video: ఆటోలో వెళ్తున్న యువతిని ఫోన్ నంబర్ అడిగిన కుర్రాళ్లు.. చివరకు చూస్తుండగానే..

చోరీలు జరిగే తీరు చూస్తే కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంటుంది. చాలా మంది నేరస్థులు పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు ఎంతో తెలివిగా నేరాలు చేస్తుంటారు. కొందరు బెదిరించి మరీ నేరాలకు పాల్పడుతుంటే.. మరికొందరు పట్టపగలు అంతా చూస్తుంగానే.. ఎవరికీ ఏమాత్రం అనుమానం రాకుండా నేరాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి చోరీలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఓ విచిత్ర చోరీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆటోలో వెళ్తున్న యువతిని ఫోన్ నంబర్ అడిగిన కుర్రాళ్లు.. చివరకు చూస్తుండగానే ఏం చేశారో చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి ఆటోలో వెళ్తూ ఉంటుంది. ఆమెను చాలా దూరం నుంచి బైకులో ఫాలో అవుతున్న కుర్రాళ్లు.. దారి మధ్యలో ఆటోకు సమీపంగా వెళ్తారు. యువతిని పలకరించి కాసేపు మాట మాట కలుపుతారు. తర్వాత ఆమె ఫోన్ నంబర్ అడిగ్గా.. (young men asked the young woman for phone number) ఇచ్చేందుకు యువతికి కూడా అంగీకరిస్తుంది. అయితే ఫోన్ నంబర్ ఇచ్చే క్రమంలో.. ‘‘మీ ఫోన్ ఇవ్వండి.. అందులో మా నంబర్ డయల్ చేస్తాం’’.. అని అడగ్గానే.. యువతి ఏమాత్రం ఆలోచించకుండా ఫోన్ వారి చేతికి ఇస్తుంది.

Viral Video: పిల్లలను సున్నితంగా ఎలా హెచ్చరించాలో.. ఈ కోతిని చూస్తే తెలిసిపోతుంది..

ఫోన్ తీసుకున్న యువకులు.. మరుక్షణంలో అక్కడి నుంచి వేగంగా ముందుకు వెళ్లిపోతారు. దీంతో ఒక్కసారిగా అవాక్కైన యువతి.. ఆటోనే వేగంగా నడిపి బైక్‌ను ఛేజ్ చేయమంటూ డ్రైవర్‌కు చెబుతుంది. చోరీ చేసిన యువకులు.. ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి చోరీ ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదు’’.. అంటూ కొందరు, ‘‘అపరితులను నమ్మొద్దు... అని అందరికీ బాగా సందేశం ఇస్తున్నారు’’.. అంటూ మరికొందరు, ‘‘స్క్రిప్టెడ్ వీడియో అయినా సందేశం బాగుంది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ముచ్చెమటలు పట్టించిన కోతి.. స్కూటీ దిగనంటే దిగనంటూ.. చివరకు ఎలాంటి ట్విస్ట్ ఇచ్చిందంటే..

Updated Date - Mar 07 , 2024 | 02:49 PM