Share News

Viral Video: గుడ్లను తినేందుకు వెళ్లిన పామును.. ఈ పక్షులన్నీ కలిసి ఎలా పరేషాన్ చేశాయో చూడండి..

ABN , Publish Date - Mar 05 , 2024 | 08:45 PM

పాములు, పక్షులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. వాటి మధ్య కొన్నిసార్లు విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. పక్షులను వేటాడే క్రమంలో పాములు, పాముల నుంచి తప్పించుకునే క్రమంలో పక్షులు శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇలాంటి..

Viral Video: గుడ్లను తినేందుకు వెళ్లిన పామును.. ఈ పక్షులన్నీ కలిసి ఎలా పరేషాన్ చేశాయో చూడండి..

పాములు, పక్షులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. వాటి మధ్య కొన్నిసార్లు విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. పక్షులను వేటాడే క్రమంలో పాములు, పాముల నుంచి తప్పించుకునే క్రమంలో పక్షులు శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు పాములు పైచేయి సాధిస్తే.. మరికొన్నిసార్లు పక్షులు విజేతలుగా నిలుస్తుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. గుడ్లను తినేందుకు గూడులోకి వెళ్లిన పాముకు పక్షులన్నీ కలిసి చుక్కలు చూపించాయి.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పాము పక్షి గుడ్లను తినేందుకు చెట్టు పైకి ఎక్కేస్తుంది. చెట్ల కొమ్మల చివరకు వెళ్లి (snake enter birds nest() చివరకు పక్షి గూడులోకి వెళ్తుంది. అయితే తమ గూడులోకి పాము వచ్చిందన్న విషయం తెలుసుకున్న పక్షులన్నీ పరుగు పరుగున అక్కడికి వస్తాయి. అప్పటికే పాము గూడులోకి దూరి గుడ్ల కోసం వెతుకుతూ ఉంటుంది. కానీ దానికి అందులో ఎలాంటి గుడ్లూ కనిపించవు.

Viral Video: తల్లిదండ్రులు, పోలీసుల ఎదుటే ప్రియుడిని కౌగిలించుకున్న యువతి.. చివరకు..

మరోవైపు పాము సమీపానికి వెళ్లిన పక్షులు.. ముక్కుతో పొడుస్తూ దాన్ని తరిమికొట్టేందుకు ప్రయత్నిస్తాయి. పక్షులన్నీ కలిసి పామును దృష్టి మళ్లిస్తూ ఒకదాని తర్వాత మరోటి దాడి చేస్తాయి. పక్షుల మూకుమ్మడి దాడితో బెదిరిపోయిన పాము.. అక్కడి నుంచి పారిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘తల్లి ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది’’.. అంటూ కొందరు, ‘‘ఈ పక్షి ప్రేమ చూస్తుంటే గుండె తరక్కుపోతోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 15వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral: ఈ గొరిల్లాల యాక్టింగ్ మామూలుగా లేదుగా.. సెల్ఫీ తీసుకుంటుండగా..

Updated Date - Mar 05 , 2024 | 09:07 PM