Share News

Viral Video: దీపావళి రాకెట్‌పై దూసుకెళ్లిన ప్రేమికులు.. వీళ్ల తెలివితేటలు మామూలుగా లేవుగా..

ABN , Publish Date - Mar 05 , 2024 | 04:25 PM

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు క్రియేట్ చేసే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. కొందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అద్భుతాలు సృష్టిస్తున్నారు. మరికొందరు ఇదే టెక్నాలజీతో నెటిజన్లకు వినోదాన్ని అందిస్తు్న్నారు. ఈ తరహా..

Viral Video: దీపావళి రాకెట్‌పై దూసుకెళ్లిన ప్రేమికులు.. వీళ్ల తెలివితేటలు మామూలుగా లేవుగా..

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు క్రియేట్ చేసే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. కొందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అద్భుతాలు సృష్టిస్తున్నారు. మరికొందరు ఇదే టెక్నాలజీతో నెటిజన్లకు వినోదాన్ని అందిస్తు్న్నారు. ఈ తరహా ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ ప్రేమ జంట రాకెట్‌పై కూర్చుని నింగిలోకి దూసుకెళ్లింది. వీళ్ల తెలివితేటలు చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ప్రేమ జంట (lovers) దీపావళి రాకెట్‌తో వినూత్న ప్రయోగం చేసింది. పెద్ద సైజు రాకెట్‌ను (Diwali Rocket) తయారు చేసుకుని, ఇద్దరూ దానిపై కూర్చున్నారు. తర్వాత ఓ బాలుడు రాకెట్‌కు నిప్పు పెట్టాడు. వెలిగించిన కాసేపటికి రాకెట్ నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రేమ జంట కూడా రాకెట్‌పై నవ్వులు చిందిస్తూ దూసుకెళ్లింది.

Viral Video: మరీ ఇంత ఈజీనా.. వావ్..! ఈ మహిళ ఆమ్లెట్ టెక్నిక్.. అదిరిపోయిందిగా..

ఆకాశంలోకి వెళ్లిన తర్వాత సదరు వ్యక్తి కింద ఉన్న బాలుడికి చేతులూ ఊపుతూ తన సంతోషాన్ని తెలియజేస్తాడు. చూసేందుకు వీరు నిజంగానే రాకెట్‌పై దూసుకెళ్లినట్లుగా అనిపిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వారు ఈ విధంగా వినియోగించుకోవడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. దీనిపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వీరి క్రియేటివిటీ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘దీపావళి రాకెట్‌పై గగన్‌యాన్ ప్రయోగం’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 11 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: మట్టి తవ్వుతుండగా బయటపడ్డ విచిత్ర ఆకారం.. తీక్షణంగా పరిశీలించగా.. చివరకు..

Updated Date - Mar 05 , 2024 | 04:25 PM