Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Viral Video: ఇండియాలో టాలెంట్‌కి కొదవే లేదు.. ఈ ఆటో స్టంటే అందుకు నిదర్శనం.. వీళ్లు టైరు మార్చిన స్టైల్ చూస్తే..

ABN , Publish Date - Mar 03 , 2024 | 04:12 PM

ఎంతో టాలెంట్ ఉండి.. ఎలాంటి సపోర్ట్ లేక ఎంతో మంది మట్టిలో మాణిక్యాలుగా మిగిలిపోతుంటారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి వారు క్షణాల్లో వెలుగులోకి వచ్చి.. ఇట్టే ఫేమస్ అయిపోతున్నారు. కొందరైతే మన కళ్లను మనమే నమ్మలేని విధంగా విన్యాసాలు చేస్తుంటారు. ఇలాంటి...

Viral Video: ఇండియాలో టాలెంట్‌కి కొదవే లేదు.. ఈ ఆటో స్టంటే అందుకు నిదర్శనం.. వీళ్లు టైరు మార్చిన స్టైల్ చూస్తే..

ఎంతో టాలెంట్ ఉండి.. ఎలాంటి సపోర్ట్ లేక ఎంతో మంది మట్టిలో మాణిక్యాలుగా మిగిలిపోతుంటారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి వారు క్షణాల్లో వెలుగులోకి వచ్చి.. ఇట్టే ఫేమస్ అయిపోతున్నారు. కొందరైతే మన కళ్లను మనమే నమ్మలేని విధంగా విన్యాసాలు చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఆటోను వేగంగా నడుపుతూనే మరోవైపు టైరును మార్చిన యువకుల వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు యువకులు ఆటోపై (Auto Stunt) విచిత్ర విన్యాసాం చేశారు. ఆటోను వేగంగా నడుపుతున్న యువకుడు.. మార్గ మధ్యలో వాహనాన్ని గాల్లోకి లేపి రెండు టైర్లపై నడిపాడు. ఇలా నడుపుతుండగా.. వెనుక కూర్చున్న మరో యువకుడు గాల్లోకి లేచిన టైరును విప్పేశాడు. మరోవైపు ఆటో రెండు టైర్లపై వేగంగా వెళ్తూనే ఉంటుంది. కాసేపటికి వెనుక నుంచి మరో ఆటోలో ఇంకో టైరును తీసుకొచ్చి.. విన్యాసం చేస్తున్న యువకుడికి అందిస్తారు.

Viral Video: ఆహారం కోసం వెతుకుతూ మొసలి కంట పడ్డ జాగ్వార్.. చివరికి మీరు కలలో కూడా ఊహించని భారీ ట్విస్ట్..

వెనుక టైరును తీసేసిన అతను.. వారు ఇచ్చిన కొత్త టైరును అందుకుని, దాన్ని వెనుక భాగంలో ఫిట్ చేస్తాడు. అంతసేపూ ఆ ఆటో రెండు టైర్ల మీదే వెళ్తుంటుంది. తర్వాత ఆటోను ఎలాంటి ప్రమాదం జరగకుండా సేఫ్‌గా ల్యాండ్ చేస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! వీరి టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇద్దరికీ మంచి టాలెంట్ ఉంది’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి విన్యాసాలను ఎవరూ అనుకరించవద్దు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: మట్టి తవ్వుతుండగా బయటపడ్డ విచిత్ర ఆకారం.. తీక్షణంగా పరిశీలించగా.. చివరకు..

Updated Date - Mar 03 , 2024 | 04:12 PM