Share News

Viral: ఆ ఇద్దరు నర్సులకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే..! రోడ్డు పక్కన జనం మధ్యలో 33 ఏళ్ల మహిళ ఉన్నట్టుండి..

ABN , Publish Date - Feb 29 , 2024 | 08:47 PM

వైద్య వృత్తిలో ఉన్న వారిలో కొందరు వారి వృత్తికే మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తుంటే.. మరికొందరు ‘‘వైద్యో నారాయణో హరి..!’’.. అన్న నానుడిని నిజం చేసేలా ప్రవర్తిస్తుంటారు. చాలా మంది వైద్యులు తమ ప్రాణాలు ఫణంగా పెట్టి మరీ రోగుల ప్రాణాలను కాపడడం చూస్తుంటాం. ఇలాంటి అనేక సంఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...

Viral: ఆ ఇద్దరు నర్సులకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే..! రోడ్డు పక్కన జనం మధ్యలో 33 ఏళ్ల మహిళ ఉన్నట్టుండి..

వైద్య వృత్తిలో ఉన్న వారిలో కొందరు వారి వృత్తికే మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తుంటే.. మరికొందరు ‘‘వైద్యో నారాయణో హరి..!’’.. అన్న నానుడిని నిజం చేసేలా ప్రవర్తిస్తుంటారు. చాలా మంది వైద్యులు తమ ప్రాణాలు ఫణంగా పెట్టి మరీ రోగుల ప్రాణాలను కాపడడం చూస్తుంటాం. ఇలాంటి అనేక సంఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. రోడ్డు పక్కన జనం మధ్యలో 33 ఏళ్ల గర్భిణికి పురటినొప్పులు వచ్చాయి. గమనించిన ఇద్దరు నర్సులు చివరకు చేసిన పని అందరి ప్రశంసలనూ అందుకుంటోంది.

సోషల్ మీడియాలో ఓ వార్త (Viral news) తెగ వైరల్ అవుతోంది. ఉత్తర ప్రదేశ్‌లోని (Uttar Pradesh) గ్రేటర్ నోయిడాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ప్రశాంత్ శర్మ అనే వ్యక్తి ప్యారీ చౌక్‌లో పని చేస్తుంటాడు. ఇదిలావుండగా, ఇతడి 33 ఏళ్ల భార్య రోషిణి కడుపుతో ఉంది. మంగళవారం ఆమెకు పురిటినొప్పులు (Labor pains) మొదలయ్యాయి. దీంతో ప్రశాంత్ తన భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు బయలుదేరాడు. స్థానిక శారదా ఆస్పత్రికి సమీపానికి వెళ్లే సరికే పురిటినొప్పులు మరింత ఎక్కువయ్యాయి. రోడ్డు పక్కన జనం మధ్యలో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

Optical illusion: ఇక్కడ కనిపిస్తున్న గడ్డిలో ఓ పిల్లి దాక్కుని ఉంది.. కనిపెట్టగలిగితే మీ చూపు పవర్‌ఫుల్‌గా ఉన్నట్లే..

భార్య పరిస్థితి చూసి ఏం చేయాలో తెలీని ప్రశాంత్.. చుట్టుపక్కల వారిని సాయం కోరాడు. అదే సమయానికి శారదా ఆస్పత్రిలో విధులు ముగించుకుని అక్కడికి వచ్చిన ఓ దేవీ అనే నర్సు వారిని గమనించి, వెంటనే గర్భిణి (pregnant woman) వద్దకు చేరుకుంది. అలాగే జ్యోతి అనే తన తోటి నర్సుకు ఫోన్ చేసి పిలిపించింది. చివరకు ఇద్దరూ కలిసి గర్భిణికి రోడ్డు పైనే ప్రసవం చేశారు. ఆ సమయంలో అక్కడున్న మిగతా మహిళలంతా గుడ్డను అడ్డుగా పెట్టుకుని నిల్చున్నారు. చివరకు ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత తల్లీ, బిడ్డను ఆస్పత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు.. తల్లీ బిడ్డ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెప్పారు. సమయానికి స్పందించి ప్రసవం చేసిన నర్సులను ప్రజలంతా ప్రశంసలతో ముంచెత్తారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘‘ఈ నర్సులు వైద్యవృత్తికే వన్నె తెచ్చారు’’.. అంటూ నెటిజన్లు వారిని అభినందిస్తున్నారు.

Viral Video: ఓర్నీ దుంపతెగ..! ఇంతకీ నువ్వు పోలీసోడివేనా.. బిచ్చగాడితో కలిసి ఏంటా పని?

Updated Date - Feb 29 , 2024 | 08:47 PM