Share News

Viral Video: పాత టీషర్ట్‌తో మ్యాజిక్.. టెంకాయలు తెంపడానికి ఇతడు వాడిన టెక్నిక్ చూస్తే..

ABN , Publish Date - Feb 28 , 2024 | 06:18 PM

కొందరి విచిత్రంగా ఆలోచిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇంకొందరు తమ తెలివితేటలకు మరింత పదును పెట్టి ఏవేవో అద్భుతాలు చేస్తుంటారు. ఇంకొందరు...

Viral Video: పాత టీషర్ట్‌తో మ్యాజిక్.. టెంకాయలు తెంపడానికి ఇతడు వాడిన టెక్నిక్ చూస్తే..

కొందరి విచిత్రంగా ఆలోచిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇంకొందరు తమ తెలివితేటలకు మరింత పదును పెట్టి ఏవేవో అద్భుతాలు చేస్తుంటారు. ఇంకొందరు అందుబాటులో ఉన్న వస్తువులతోనే అద్భుతాలు చేస్తుంటారు. ఇలాంటి ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి పాత టీషర్ట్‌ని వినియోగించి కొబ్బరి చెట్టును చకచకా ఎక్కేయడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొబ్బరి చెట్టును ఎక్కే వారు అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవడం చూస్తుంటాం. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి విచిత్ర ప్రయోగం చేశాడు. వట్టి చేతులతో కొబ్బరి చెట్టు (coconut tree) వద్దకు వెళ్లి.. పాత టీషర్ట్‌ను తాడులా చుట్టేశాడు. తర్వాత దాన్ని రెండు పాదాలకు తగిలించుకుని కొబ్బరి చెట్టు పైకి చకచకా ఎక్కేశాడు.

Viral Video: సైకిల్‌పై వెళ్తూనే వేడి వేడి టర్కిష్ కాఫీ తయారీ.. వామ్మో..! ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా..

టెంకాయలను తెంపి కిందపడేసిన తర్వాత.. అంతే చాకచక్యంగా కిందకు దిగేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘మీ ఐడియా అదుర్స్.. బ్రదర్’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి ప్రయోగాలు ఎవరూ చేయొద్దు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: బాలికను రక్షించేందుకు కుక్క వెరైటీ ప్లాన్.. తుపాకీతో కాల్చగానే అది చేసిన నిర్వాకం చూస్తే..

Updated Date - Feb 28 , 2024 | 07:55 PM