Share News

Viral Video: ఈమె ధైర్యానికి సెల్యూట్ చేయాల్సిందే.. సమయానికి వచ్చి ఇతన్ని ఎలా కాపాడిందో చూడండి..

ABN , Publish Date - Feb 27 , 2024 | 08:30 PM

ప్రమాదాలు చెప్పి రావు.. కొన్నిసార్లు ఊహించకుండా వచ్చి పడే ప్రమాదాలు పెను విషాదాన్ని మిగిల్చితే.. మరికొన్నిసార్లు తృటిలో తప్పి పోతుంటాయి. ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా ఫోన్లు ఉండడం, ఏ వీధిలో చూసినా...

Viral Video: ఈమె ధైర్యానికి సెల్యూట్ చేయాల్సిందే.. సమయానికి వచ్చి ఇతన్ని ఎలా కాపాడిందో చూడండి..

ప్రమాదాలు చెప్పి రావు.. కొన్నిసార్లు ఊహించకుండా వచ్చి పడే ప్రమాదాలు పెను విషాదాన్ని మిగిల్చితే.. మరికొన్నిసార్లు తృటిలో తప్పి పోతుంటాయి. ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా ఫోన్లు ఉండడం, ఏ వీధిలో చూసినా సీసీ కెమెరాలు ఉండడం వల్ల ఇలాంటి అనూహ్య ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ సమయానికి సమయానికి స్పందించి, ఓ యువకుడిని కుక్క దాడి నుంచి రక్షించింది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈ మహిళ ధైర్యానికి సెల్యూట్’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. దుకాణాల వద్ద చాలా మంది జనం రద్దీ ఉంటారు. ఆ సమయంలో అక్కడే ఉన్న దుకాణం నుంచి ఓ యువకుడు రోడ్డు పైకి వస్తాడు. రోడ్డుపై రెండు కుక్కలు నిలబడి ఉంటాయి. ఆ యువకుడు కుక్క సమీపానికి వచ్చి నిలబడతాడు. దీంతో వాటిలో ఓ కుక్క సడన్‌గా (Dog attack on youth) అతడిపై దాడి చేస్తుంది. కాలును గట్టిగా పట్టుకోవడంతో ఆ వ్యక్తి కేకలు పెడతాడు. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ మహిళ.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అక్కడికి వచ్చి యువకుడిని కాపాడే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో కుక్కను పట్టుకుని పక్కకు లాగే ప్రయత్నం చేస్తుంది.

Viral Video: వామ్మో..! ఇతనేంటీ.. విమానంలో ఇలా చేశాడు.. చివరికి ఏమైందో మీరే చూడండి..

అయినా కుక్క అతన్ని వదలకుండా గట్టిగా పట్టుకుంటుంది. అంతలోనే పక్కన ఉన్న వారు కూడా అక్కడికి వచ్చి కాపాడే ప్రయత్నం చేస్తారు. సదరు మహిళ చివరకు కుక్కను గట్టిగా పట్టుకుని పక్కకు లాగేస్తుంది. ఈ క్రమంలో ఆ కుక్క మహిళ చేయిని కూడా కొరికేస్తుంది. అయితే ఎలాగోలా కుక్క దాడి నుంచి తప్పించుకుంటుంది. చివరకు అంతా కలిసి ఆ కుక్కను అక్కడి నుంచి తరిమికొడతారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమె ధైర్యానికి సెల్యూట్’’.. అంటూ కొందరు, ‘‘ప్రాణాలకు తెగించి కాపాడింది’’.. అంటూ మరికొందరు, ‘‘సమాజాంలో ఇలాంటి వారు చాలా అరుదుగా కనిస్తుంటారు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 10వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral: ప్రియుడికి ముద్దు పెడుతుండగా సడన్‌గా ఎంటరైన భర్త.. చివరకు ఆమె ఇచ్చిన షాక్ మామూలుగా లేదుగా..

Updated Date - Feb 27 , 2024 | 08:30 PM