Share News

Viral Video: వామ్మో..! ఇతనేంటీ.. విమానంలో ఇలా చేశాడు.. చివరికి ఏమైందో మీరే చూడండి..

ABN , Publish Date - Feb 27 , 2024 | 06:35 PM

విమాన ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు వింత వింత ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. ప్రయాణికులు ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం, అత్యవసర ద్వారాలను తెరవడం, విష సర్పాలు లోపలికి ప్రవేశించడం..

Viral Video: వామ్మో..! ఇతనేంటీ.. విమానంలో ఇలా చేశాడు..  చివరికి ఏమైందో మీరే చూడండి..

విమాన ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు వింత వింత ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. ప్రయాణికులు ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం, అత్యవసర ద్వారాలను తెరవడం, విష సర్పాలు లోపలికి ప్రవేశించడం.. తదితర విచిత్ర ఘటనలు చోటు చేసుకోవడం గతంలో చాలా చూశాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. విమానం గాల్లో ఉండగా.. ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఫుల్‌గా మద్యం సేవించి, వీరంగం సృష్టించాడు. చివరకు ఏం జరిగిందంటే..

దుబాయ్-ఇస్లామాబాద్ (Dubai-Islamabad flight) ఎమిరేట్స్ బోయింగ్ బి777-300ఇఆర్ విమానంలో ఫిబ్రవరి 25న ఈ ఘటన చోటు చేసుకుంది. విమానం ప్రయాణికులతో గాల్లోకి లేచిన కొద్ది సేపటి తర్వాత లోపల షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఫుల్‌గా మందుతాగిన (drunk passenger) ఓ ప్రయాణికుడు.. అటూ ఇటూ తిరుగుతూ అందరినీ భయపెట్టాలని చూశాడు. ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ తోటి ప్రయాణికులంతా మిన్నకుండిపోయారు. చివరకు విమాన సిబ్బంది గమనించి అతడికి నచ్చజెప్పాలని చూశారు.

Viral Video: ఈ అమ్మాయి పెద్ద శాడిస్టులా ఉందే.. బస్సులో ప్రయాణికులను ఎలా హడలెత్తించిందంటే..

విమాన సిబ్బంది చెబుతున్నా.. ఆ యువకుడు మాత్రం వారి మాట కూడా వినకుండా మరింత గొడవ చేశాడు. అంతటితో ఆగకుండా ఎయిర్‌హోస్టెస్ పట్ల కూడా అసభ్యకరంగా ప్రవర్తించాడు. అడ్డు వచ్చిన సిబ్బందిపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో విధిలేని పరిస్థితుల్లో సిబ్బంది అంతా కలిసి అతన్ని గట్టిగా పట్టుకుని కింద పడుకోబెట్టారు. చేతులు వెనక్కు కట్టేసి బంధించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మందుబాబుకు చుక్కలు చూపించారుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇలా చేసే వాళ్లను కఠినంగా శిక్షించాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2.50లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral: ప్రియుడికి ముద్దు పెడుతుండగా సడన్‌గా ఎంటరైన భర్త.. చివరకు ఆమె ఇచ్చిన షాక్ మామూలుగా లేదుగా..

Updated Date - Feb 27 , 2024 | 06:35 PM