Share News

Viral Video: కోతుల దెబ్బంటే ఎలా ఉంటుందో.. ఈ పులికి నడి రోడ్డుపైనే చూపించాయిగా..

ABN , Publish Date - Feb 24 , 2024 | 08:35 PM

కోతి చేష్టలు ఎంతలా నవ్వు తెప్పిస్తాయో.. కొన్నిసార్లు అంతలా చిరాకు పుట్టిస్తాయి. ఇక పొరపాటున వాటిని కెలికితే మాత్రం చివరకు చుక్కలు చూపిస్తాయి. అప్పుడప్పుడూ పెద్ద పెద్ద జంతువులు సైతం ...

Viral Video: కోతుల దెబ్బంటే ఎలా ఉంటుందో.. ఈ పులికి నడి రోడ్డుపైనే చూపించాయిగా..

కోతి చేష్టలు ఎంతలా నవ్వు తెప్పిస్తాయో.. కొన్నిసార్లు అంతలా చిరాకు పుట్టిస్తాయి. ఇక పొరపాటున వాటిని కెలికితే మాత్రం చివరకు చుక్కలు చూపిస్తాయి. అప్పుడప్పుడూ పెద్ద పెద్ద జంతువులు సైతం వాటి ముందు నిలవలేక తోక ముడవాల్సిన పరిస్థితి ఎదురవుతుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. కోతుల పైకి దాడి చేయడానికి వెళ్లిన పులి పరిస్థితి చివరకు దారుణంగా తయారైంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. దక్షిణాఫ్రికాలోని (South Africa) క్రుగర్ నేషనల్ పార్క్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పర్యాటకులు అడవి జంతువులను చూసే క్రమంలో నడి రోడ్డుపై వారికి షాకింగ్ దృశ్యం కనిపించింది. అటుగా వచ్చిన కోతుల మందను ఓ పులి టార్గెట్ చేసింది. వాటిలో ఓ కోతిపై దాడి చేయబోయింది. దీంతో పక్కనే ఉన్న కోతులన్నీ ఒక్కసారిగా అలెర్ట్ అయ్యాయి. పులిపై సామూహికంగా (Monkeys attacked the tiger) దాడికి పాల్పడ్డాయి.

Viral News: మహిళా టీచర్ వింత నిర్వాకం.. విద్యార్థులను ఆలయానికి తీసుకెళ్లి మరీ.. చివరకు..

పులిని అటూ ఇటూ తిప్పుతూ పులిని కన్ఫ్యూజ్ చేసి మరీ తమ పొడవాటి గోర్లతో రక్కిపడేశాయి. దెబ్బకు పులికి చుక్కలు కనిపించాయి. చివరకు చేసేదేమీలేక అక్కడి నుంచి పారిపోయింది. అయినా కోతులు వదలకుండా పులిని తరిమి తరిమి కొట్టాయి. ఈ ఘటన మొత్తం పర్యాటకుల వాహనాల ఎదుటే చోటు చేసుకుంది. ఈ ఘటనను వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపైనెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కోతుల దెబ్బ.. పులి అబ్బా’’.. అంటూ కొందరు, ‘‘కోతులతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది మరి’’... అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఈ ఫ్యామిలీ ఏంటీ.. ఎక్కడా స్థలం లేనట్లు.. ఏకంగా రైలు బోగీలోనే..

Updated Date - Feb 24 , 2024 | 08:35 PM