Share News

Viral Video: మందుబాబులను కట్టిపడేస్తున్న ఆటో.. ఈ డ్రైవర్ ఏర్పాట్లు మామూలుగా లేవుగా..

ABN , Publish Date - Feb 22 , 2024 | 03:55 PM

ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో చాలా మంది అతి తెలివిగా ఆలోచిస్తుంటారు. ఇక వివిధ రకాల వ్యాపారస్థులైతే.. తమ వ్యాపారాన్ని ప్రచారాన్ని చేసుకునేందుకు వినూత్న పద్ధతులను అవలంభిస్తుంటారు. సాధారణంగా...

Viral Video: మందుబాబులను కట్టిపడేస్తున్న ఆటో.. ఈ డ్రైవర్ ఏర్పాట్లు మామూలుగా లేవుగా..

ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో చాలా మంది అతి తెలివిగా ఆలోచిస్తుంటారు. ఇక వివిధ రకాల వ్యాపారస్థులైతే.. తమ వ్యాపారాన్ని ప్రచారాన్ని చేసుకునేందుకు వినూత్న పద్ధతులను అవలంభిస్తుంటారు. సాధారణంగా భిన్నంగా ఆలోచిస్తూ.. నెట్టింట వైరల్ అవుతున్న వ్యాపారస్తులను చాలా మందిని చూశాం. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ ఆటో డ్రైవర్ తెలివి చూసి నెటిజన్లు అవాక్కవుతన్నారు. మందుబాబులను ఆకట్టకునేలా ఇతను తన ఆటోలో చేసిన ఏర్పా్ట్లు చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పలువురు వాహనదారులు తమ వాహనాలను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకోవడం చూస్తూ ఉంటాం. అలాగే ఆటో డ్రైవర్లు కూడా ప్రయాణికులను ఆకట్టుకునేలా వాటిని తీర్చిదిద్దడం చూస్తుంటాం. కొందరు తమ ఆటోల వెనుక వింత వింత కొటేషన్లు రాస్తూ ఆకట్టుకుంటుంటే.. మరికొందరు తమ వాహనాలను విచిత్రమైన ఆకృతిలోకి మార్చి అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు. అయితే తాజాగా, వైరల్ అవుతున్న వీడియోలో ఓ ఆటో డ్రైవర్ తెలివి చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఓ ఆటో డ్రైవర్ ఎంతో తెలివిగా ఆలోచించి, తన ఆటోలో (driver decorated the liquor bottles in auto) మద్యం సీసాలను ప్రదర్శనగా ఉంచాడు.

Viral Video: ఇలాంటి కుక్క ఒక్కటి ఉన్నా చాలు.. పిల్లాడిని ఎలా కాపాడుతుందో చూస్తే..

ఆటో వెనుక సీటువైపు పూల కుండీలను పెట్టి, రంగు రంగు లైట్లను ఏర్పాట చేశాడు. అలాగే మధ్యలో రెండు వైపులా మద్యం బాటిళ్లను అలంకరణగా సెట్ చేశాడు. అలాగే స్టీరింగ్ ముందు వైపు అనేక రకాల బ్రాండ్లకు చెందిన మందు బాటిళ్లను అలంకరించాడు. చూడగానే ఇదేదో అందమైన బార్ తరహాలో కనిపిస్తోంది. ఈ ఆటోను చూసిన వారంతా తమ చూపును తిప్పుకోలేకపోతున్నారు. కొందరు ఈ ఆటోను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ఆటో డ్రైవర్ తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఈ వాహనం నడపాలంటే ఎంతో ధైర్యం ఉండాలి’’.. అంటూ మరికొందరు, ‘‘మందుబాబులు దాడి చేయకుండా చూసుకో’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: అరెరే..! అనవసరంగా భార్యతో పెట్టుకున్నాడే.. చివరకు ఈ భర్త పరిస్థితి ఏమైందో చూస్తే..

Updated Date - Feb 22 , 2024 | 03:55 PM